Begin typing your search above and press return to search.
జేసీ సంచలనం!...బీజేపీ గెటౌట్ అంటోందట!
By: Tupaki Desk | 27 Dec 2017 5:31 PM GMTసంచలన వ్యాఖ్యలకే కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న టీడీపీ నేత - అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఆ సంచలనాలకే సంచలనంగా మారిన ఓ విషయాన్ని బయటపెట్టేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. గడచిన ఎన్నికల్లో కలిసే పోటీ చేసిన ఈ రెండు పార్టీలు... కేంద్రంలోనే కాకుండా ఏపీలోనూ ప్రభుత్వాలను పంచుకుంటున్నాయి. అంటే ఇరు పార్టీల మధ్య ఎంతో అన్యోన్యత ఉన్నట్లే లెక్క. మరి ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులో ఉన్న ఏపీని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు ఎందుకు సాయం చేయడం లేదంటే... అందుకు చాలా కారణాలే వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదాను కూడా కాదనేసిన మోదీ... ప్రత్యేక ప్యాకేజీ పేరిట ఓ కొత్త మంత్రాన్ని పఠించి... దానిని కూడా పూర్తిగా విడుదల చేయడం లేదు. దీనిపై తన మిత్రపక్ష పార్టీ అధినేతగానే కాకుండా తనకు మిత్రుడిగా - ఏపీకి సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఎంతగా మదనపడిపోతున్నారో తెలిసినా కూడా... మోదీ మనసు కరిగిన పాపాన పోలేదు.
అయితే టీడీపీ అడిగిన ప్రతి విషయాన్ని మోదీ సర్కారు ఎందుకు కాదంటోందన్న విషయాన్ని చెప్పేందుకు తాజాగా మీడియా ముందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు. అసలు బీజేపీ వద్ద తమ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పిన జేసీ... తనదైన శైలిలో ఆ వ్యాఖ్యలను పండిచేశారనే చెప్పాలి. అయినా జేసీ ఏమన్నారన్న విషయానికి వస్తే... టీడీపీ అధినేతగా, ఏపీ సీఎంగా ఏదైనా గట్టిగా అడిగేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళితే... మోదీ మాత్రం గెటౌట్ అనేస్తున్నారట. ఈ కారణంగానే మోదీ సర్కారుపై చంద్రబాబు ఒత్తిడి తేలేకపోతున్నారని, ఏపీకి అన్యాయం జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో తామున్నామని జేసీ చెప్పారు. గట్టిగా అడిగితే గెటౌట్ అనే మాట వినిపిస్తుంటే తామేం చేయగలమని కూడా ఆయన చంద్రబాబు పరువను నిజంగానే బజారున పడేశారు.
అంతేకాదండోయ్...కేంద్రంలో టీడీపీ పరిస్థితి కూరలో కరివేపాకు మాదిరిగా, ఆటలో అరటి పండు మాదిరిగా మారిపోయిందని కూడా జేసీ వ్యాఖ్యానించారు. ఇంకాస్త ముందుకు వెళ్లిన జేసీ... అసలు తమ పరిస్థితి ఇప్పుడు... బీజేపీ చేతులు ఎత్తమంటే ఎత్తడం, దించమంటే దించడం చేయడం మినహా మరేమీ చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని, ఏదో నెంబరు కోసమే తాము ఉన్నామని కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే... కేంద్రం వద్ద రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చెప్పేందుకే యత్నించిన జేసీ... చంద్రబాబు పరువును, టీడీపీ పరువును నట్ట నడి బజారులో పడేశారని చెప్పక తప్పదు.