Begin typing your search above and press return to search.
చంద్రబాబు తోపేమీ కాదంటున్న టీడీపీ ఎంపీ
By: Tupaki Desk | 20 Dec 2016 12:07 PM GMTరాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేసేవారు చాలా మందికి ఉండి ఉండొచ్చు కానీ.. వారిలో జేసీ దివాకర్ రెడ్డి స్థానం కచ్చితంగా ప్రత్యేకం. ఆయన స్పందించాలని అనుకోవాలే కానీ స్వపక్షమా విపక్షమా, అధినేతా ప్రతిపక్ష నేతా అనే తారతమ్యాలేమీ ఉండవు. చెప్పాలనుకున్న విషయం సుత్తు లేకుండా సూటిగా చెప్పేస్తారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేశారు జేసీ.
టీడీపీ నేతలెవరూ ఇష్టం ఉన్నా లేకున్నా చంద్రబాబు నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయరనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది! అయితే తాజాగా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలపై నిష్కర్షగా విమర్శలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. అధికారుల చేతికి పాలనా పగ్గాలు అప్పగించొద్దని, అది ఏ ఒక్కరికీ మంచిది కాదనే విషయం చాలా సార్లు చెప్పానని చెప్పిన జేసీ... ఈ విషయం వినకుండా పెడచెవిన పెడితే సమస్యలు కొని తెచ్చుకుంటారని హెచ్చరించారు. ఇదంతా ఒకెత్తు అయితే... తెలుగుదేశం పార్టీలో తనకు దక్కుతున్న గుర్తింపు గురించి మరికొన్ని ఆసక్తికరమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ. ప్రస్తుతం ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పద్ధతి ఇంకా మార్చుకోవడం లేదని మొదలు పెట్టిన జేసీ దివాకర్ రెడ్డి.. అయన ఇంకా ఉద్యోగులనే నమ్ముకుంటున్నారనీ, అలా పరిపాలన చేయడం సరికాదని గతంలో తాను చాలాసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని వ్యాఖ్యానించారు. అలాగే తాను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం చంద్రబాబు కాదనీ, ఆయన పిలవగానే వచ్చేయడానికి ఆయనేమీ మహాత్మా గాంధీ కాదు అని జేసీ వ్యాఖ్యానించారు. అయితే... వైకాపా అధినేత జగన్ అధికారంలోకి రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను తెలుగుదేశంలో చేరాను తప్ప కేవలం చంద్రబాబు పిలిచారని కాదని తెలిపారు.
ఇక, తెలుగుదేశం పార్టీలో తనకు, తనలాంటి సీనియర్లకు దక్కుతున్న ప్రాధాన్యతన గురించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు జేసీ. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉంటున్న సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వంటివారికే దిక్కులేదు, ఇక తనలా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముందని జేసీ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/