Begin typing your search above and press return to search.
కటీఫ్ కాలం వచ్చేసిందంటున్న జేసీ
By: Tupaki Desk | 31 July 2016 12:40 PM ISTముక్కుసూటి వ్యాఖ్యలకు - ముఖం మీదే విమర్శలకు పేరుగాంచిన టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై తన మనసులోని మాటను కుండబద్ధలు కొట్టేశారు. అంతేకాదు.. కొద్దిరోజుల్లో ఏం జరగబోతోందో చెబుతూనే.. అలా చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే చెప్పానని కూడా చెప్పుకొచ్చారు. టీడీపీ-బీజేపీ బంధం తెగిపోవడానికి సమయం సమీపించిందని.. ఇక ఎక్కువ కాలం బంధం నిలవదని చెప్పారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సిందిగా ఏడాది క్రితమే తాను చంద్రబాబుకు సలహా ఇచ్చానన్నారు.
అంతేకాదు... బీజేపీతో తెగదెంపులు ఎప్పటిలోగా చేసుకోవాలో కూడా చెప్పారు. వచ్చే మార్చిలోగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే టీడీపీకి మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ఇది సాగే సంసారం కాదని, ఇక విడాకులు ఎప్పుడు తీసుకోవాలన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలన్నారు.
మోడీ చంద్రబాబును ప్రధాన శత్రువుగా భావిస్తున్నారని దివాకర్ రెడ్డి చెప్పారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తి చంద్రబాబు - బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు మాత్రమే ఉందన్నారు. అందుకే చంద్రబాబును చూసి మోడీ భయపడుతున్నారని నిప్పు రాజేశారు జేసీ. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే మోడీకి రూల్స్ అడ్డంకి కావన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇచ్చేఆలోచన కేంద్రానికి లేదన్నారు. అందుకే రూల్స్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని జేసీ వ్యాఖ్యానించారు. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా జేసీ ఏమీ లేకుండా ఇన్ని మాటలు చెప్పరని.. చంద్రబాబు - టీడీపీ మనసులో ఏదో ఉందని.. దాని ఫలితాలకు సంకేతమే జేసీ మాటలు కావొచ్చని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జేసీ మాటలే నిజమైతే మరో రెండు నెలల్లో టీడీపీ - బీజేపీల పొత్తు ముగిసిపోయే అవకాశం ఉందన్నమాట.