Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ 100 రోజుల పాల‌న‌పై జేసీ ఏమన్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Sep 2019 10:09 AM GMT
జ‌గ‌న్ 100 రోజుల పాల‌న‌పై జేసీ ఏమన్నారో తెలుసా?
X
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పాల‌న‌పై స‌హ‌జంగానే అటు వైసీపీ నేత‌లు ఆకాశానికి ఎత్తేస్తూ ప్ర‌శంస‌లు కురిపించేస్తున్నారు. మేథావులు - రాజ‌కీయ విశ్లేష‌క‌లు కూడా జ‌గ‌న్ పాల‌న‌పై ఎవరికి తోచిన‌ట్టు వారు మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ నేత‌లు జ‌గ‌న్ పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చూపుతున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్‌ రెడ్డి మాత్రం జ‌గ‌న్ పాల‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జేసీ అంటేనే పార్టీ అధికారంలో ఉన్నా లేక‌పోయినా... గెలిచినా.. ఓడినా కుండ‌బ‌ద్దలు కొట్టేస్తూ మాట్లాడేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పాల‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జేసీ జ‌గ‌న్‌ పై వ్యాఖ్య‌లు చేస్తున్నాడంటే స‌హ‌జంగానే వ్య‌తిరేకంగా మాట్లాడుతారేమోన‌ని మీడియా అంతా కాచుకుని కూర్చొంది. జేసీ మ‌రోసారి అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేశారు. జ‌గ‌న్ పాల‌న బాగుందంటూనే మా వాడు చాలా తెలివైన వాడు అని కితాబు ఇచ్చారు. కేవ‌లం 100 రోజుల పాల‌న‌లోనే ఇన్ని ల‌క్ష‌ల ఉద్యోగాలు ఎవ‌రు ? ఇస్తారంటూ ప్ర‌శంసించారు. అయితే ప్ర‌స్తుతం వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల నేప‌థ్యంలో ప్ర‌తి అంశాన్ని మైక్రోస్కోప్‌ లో పెట్టి చూసి.. వాటిని స‌రిదిద్దాల‌ని సూచించారు.

జ‌గ‌న్‌ ను ప్ర‌స్తుతం చేయిప‌ట్టి న‌డిపించే వ్యక్తి కావాల‌న్న జేసీ... ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం మోయ‌లేని భారం తెచ్చి నెత్తిమీద పెట్టుకోవ‌డ‌మే అన్నారు. ఇక రాజ‌ధాని మారిపోతుంద‌ని కొద్ది రోజులుగా కామెంట్లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన జేసీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఎక్క‌డ‌కి త‌ర‌లిపోద‌ని... అది అక్క‌డే ఉంటుంద‌ని తేల్చేశారు. ఇక వ‌లంటీర్లు లంచాలు తీసుకుంటున్నార‌ని కొన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను ప్ర‌స్తావించిన జేసీ.. ఇలాంటి వార్త‌ల‌ను తాను న‌మ్మ‌న‌ని చెప్పారు. ఏదేమైనా జ‌గ‌న్‌ ను ప్ర‌శంసిస్తూ జేసీ చేసిన వ్యాఖ్య‌ల‌పై అటు టీడీపీ వాళ్లు.. ఇటు వైసీపీ వాళ్లు ఎలా స్పందిస్తారో ? చూడాలి.