Begin typing your search above and press return to search.
వైసీపీ ధర్నాలో టీడీపీ ఎంపీ
By: Tupaki Desk | 3 Aug 2016 12:09 PM GMTరాష్ట్ర విభజనకు ముందు వరకు ఆయన కాంగ్రెస్ నేత.. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు. విభజన తరువాత ఆయన కాంగ్రెస్ కు సీను కాలిపోయిందని గుర్తించి తెలివిగా టీడీపీలో చేరి పార్లమెంటు సీటు దక్కించుకుని పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు. కానీ.. అప్పుడప్పుడు టీడీపీకి బద్ధ విరోధి పార్టీ అయిన వైసీపీ కార్యక్రమాల వద్ద కూడా కనిపిస్తుంటారు. సొంత పార్టీ అధినేత - ముఖ్యమంత్రిని కూడా అప్పుడప్పడు విమర్శిస్తుంటారు.. విరుచుకుపడుతుంటారు.. పొగుడుతుంటారు.. చాలా ఎక్కువ కష్టపడుతున్నారంటూ జాలిపడుతుంటారు. ఇలా ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాల వద్ధా కనిపిస్తూ స్వతంత్ర సభ్యుడిలా వ్యవహరిస్తున్న ఆ ఎంపీని చూసి పార్టీ నేతలంతా ఈయన్నెలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదా.. ఎవరో కాదు - అనంతపురం ఎంపీ - టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి.
జేసీ దివాకరరెడ్డి తాజాగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు ధర్నా చేస్తుంటే అక్కడ కనిపించారు. అది కూడా పక్కనే తమ పార్టీ నేతలు ధర్నా చేస్తున్నా అటువైపు వెళ్లకుండా ప్రతిపక్ష శిబిరంలో అడుగుపెట్టి సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం బుధవారం కూడా వైసీపీ ఎంపీలు సభలో, బయట ఆందోళన కొనసాగించారు. ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సభ్యులు ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అటుగా వచ్చారు. టీడీపీ సభ్యుడైనప్పటికి వైసీపీ ఎంపీల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చట్లు పెట్టారు. వైసీపీ ఎంపీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా… ‘‘తీసుకోండి.. తీసుకోండి” అంటూ ఫోటోలకు జేసీ పోజులు కూడా ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్ కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన సమయంలోనూ పార్లమెంట్ వద్దే జేసీ ఎదురుపడ్డారు. జగన్ తో కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. జగన్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. జేసీ తీరు చూస్తుంటే… ఆయన టీడీపీలో ఉన్నారో వైసీపీలో ఉన్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా జగన్ ను ఎప్పుడూ ఆయన మావోడు అంటూ అంటుంటారు. అయితే... చంద్రబాబు మాత్రం తనకంటే సీనియర్ అయిన జేసీ చేసే ఇలాంటి పనులను లైట్ గానే తీసుకుంటారు. సరదాగా ఉండే జేసీ నలుగురితో కలివిడిగా ఉండే వ్యక్తి కాబట్టి అన్ని చోట్లకూ వెళ్తారన్నది ఆయన అభిప్రాయం. అయితే.. పార్టీ నేతల ఒత్తిడితో ఒకసారి జేసీని పిలిపించి మెల్లగా నచ్చజెప్పారు కూడా. దాంతో కొద్దికాలం జేసీ కూడా చంద్రబాబు చెప్పింది నిజమేనంటూ సెలైంటుగా ఉన్నా మళ్లీ అప్పుడప్పుడు తన సహజ శైలిలో ఇలా చెలరేగిపోతున్నారు.