Begin typing your search above and press return to search.
చిత్తూరు ఎంపీ అలా.. జేసీ ఇలా
By: Tupaki Desk | 5 Aug 2016 3:44 PM GMTరెండు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రత్యేక హోదా ఇష్యూ నేపథ్యంలో తన ఎంపీలతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన మాటలతో మోడీని ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మోడీని కలిసిన సందర్భంగా ఇప్పుడు ఏపీ ప్రజలంతా ‘‘ఓం ‘నమో’ ‘నారా’యణాయ మంత్రాన్ని జపిస్తున్నారని చెబుతూ.. తనలోని కళాకారుడ్ని బయటకు తీశారు.
ప్రత్యేక హోదా ఇష్యూ మీద రోజుకో వేషం వేసి మీడియాలో కనిపించే శివప్రసాదన్ తనలోని ‘కళ’ను ప్రధాని.. ముఖ్యమంత్రి ఎదుట ప్రదర్శించి.. నమో అంటే నరేంద్రమోడీ అని.. నారా అంటే నారా చంద్రబాబునాయుడు అని వివరించినట్లుగా చెబుతున్నారు. ఇక.. మోడీతో భేటీ సందర్భంగా హోదా ఇష్యూను చంద్రబాబు ప్రస్తావించగా.. ‘మీ సమస్య నా సమస్య’ అని ప్రధాని వ్యాఖ్యానించినట్లుగా శివప్రసాద్ చెప్పారు. మోడీ.. చంద్రబాబులు రాష్ట్రాన్ని ఆదుకుంటారన్న నమ్మకంతో ఏపీ ప్రజలు ఉన్నట్లుగా చెప్పారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీని కలిసి ఎంపీల్లో ఒకరైన జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేదన్న విషయాన్ని జేసీ కుండబద్ధలు కొట్టేశారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ‘మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. కేంద్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉండేలా కనిపిస్తోంది’ అని జేసీ తేల్చేశారు. సో.. తాజాగా మోడీతో భేటీ కావటం వేస్ట్ పోగ్రామ్ అన్నమాట.