Begin typing your search above and press return to search.
జేసీ మాట!..నిరూపిస్తే బరి నుంచి తప్పుకుంటాం!
By: Tupaki Desk | 18 Aug 2017 11:05 AM GMTసంచలన - వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వైసీపీ అధినేత జగన్ పై అవాకులు చవాకులు పేలే ఆయన.. మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని.. అవసరానికి తగ్గట్టుగా దానిని టీడీపీ అధినేత చంద్రబాబు వాడేసుకుంటున్నారు! నంద్యాల ఉప ఎన్నికల్లోనూ దీనిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షంపై బురద జల్లుతున్న విషయం తెలిసిందే! తనకు ఏ మీడియా అండ లేదని.. ఉన్నది కేవలం ప్రజల అభిమానమే అని జగన్ ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలపై జేసీ స్పందించారు.
నంద్యాల ఎన్నికల వేళ.. జేసీ మరోసారి తన నోటికి పనిచెప్పారు. అంతేగాక ఒకవిధంగా సీఎం చంద్రబాబును ఇబ్బందుల్లో పడేశారు. ప్రస్తుతం ఏపీలోని మీడియా అంతా ఎవరి అధీనంలో ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే! ఇవన్నీ తెలిసినా మళ్లీ ఆయన అసత్య ప్రచారానికి తెరతీశారు. వైసీపీ చీఫ్ జగన్ కు మీడియా మద్దతు లేదని నిరూపిస్తే నంద్యాలలో తామే ఎన్నికల నుంచి ఉపసంహరించుకుంటామని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. నంద్యాల ఉపఎన్నికల్లో ఇంత హంగామా అవసరం లేదని జేసీ అభిప్రాయపడ్డారు. జగన్ తనకు మీడియా మద్దతు లేదని చెప్పడాన్ని తప్పుబట్టారు.
ఈ విషయాన్ని జగన్ నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకొంటామని జగన్ కు సవాల్ విసిరారు. జగన్ కు మీడియా మద్దతు లేదంటున్న నేతలు... మహానేత అంటూ 24 గంటలు ఎలా ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో నమ్మకం లేని నేత ఎన్ని రోజులు రోడ్లపై తిరిగితే ఏం ప్రయోజనమన్నారు. నంద్యాల ఉప ఎన్నికల కోసం శిల్పా 50 కోట్లు - జగన్ 50 కోట్లను డంప్ చేశారని ఆరోపించారు. నాయకుడు చెప్పే మాటల్లో విశ్వాసం ఉండాలని - నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజూ అబద్ధాలు చెబితే ఎవరు నమ్ముతారని జేసీ అన్నారు.