Begin typing your search above and press return to search.
తొడగొట్టి.. మీసం మెలేసి.. వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ సవాల్.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 11 Feb 2023 7:27 PM GMTజేసీ ప్రభాకర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. అయితే.. ఈయనకు వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి.. జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదాలు, విభేదాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పెద్దారెడ్డికి జేసీ భారీ సవాల్ రువ్వారు. తొడగొట్టి.. మీసం మెలేసి.. మరీ వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ సవాల్ విసరడం.. రాజకీయంగా మరింత వేడి రగిలించింది.
''చేతనైతే నాపై కేసు పెట్టించు.. కేతిరెడ్డి పెద్దారెడ్డీ'' అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తొడకొట్టి సవాల్ విసిరారు. తుక్కు వాహనాలకు బీమా చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటున్న.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేతనైతే తనపై కేసు పెట్టించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తప్పు తనదికాదని.. అధికారులదేనని చెప్పారు. సుప్రీం కోర్టు రద్దు చేసిన బీఎస్-3 వాహనాలను అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ఆయన నిలదీశారు.
బీఎస్-3 వాహనాలకు సంబంధించిన కేసుపై నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కొనుగోలు చేసిన వాహనాలు, పోలీసులు పెట్టిన కేసుల ఎఫ్ఐఆర్‌లు, ఆర్టీఏ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాలన్నింటినీ ఒక ప్లెక్సీపై ముద్రించి.. మీడియాకు ప్రదర్శించారు. వాహనాలకు బీమా చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించానని, కేసు పెటిస్తామని చదువురాని తాడిపత్రి ఎమ్మెల్యే చెబుతున్నారని జేసీ మండిపడ్డారు.
ఎమ్మెల్యే చెప్పినట్లుగా వాహన బీమా లేదని, నకిలీ బీమా పత్రం ఇచ్చానని తనపై ఏ అధికారి అయినా కేసు పెట్టాలని సవాల్ చేశారు. అధికారులంతా చట్టాలు బాగా తెలిసినవారని అన్నారు. చేతనైతే ఎమ్మెల్యే తనపై కేసు పెట్టించాలని మీసం మెలేసి మరీ సవాల్ రువ్వారు. బీఎస్-3 వాహనాల అనుమతిని సుప్రీంకోర్టు పొడిగిస్తుందని భావించిన అశోక్ లైలాండ్ కంపెనీ దేశవ్యాప్తంగా 68 వేల వాహనాలు విక్రయించిందని జేసీ తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసరికే అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తైందన్నారు. అయితే, దేశంలో తనపైనే మాత్రమే ఇలాంటి కేసులు పెట్టారని, దీనికి కోర్టులో అన్ని ఆధారాలతో సమాధానం చెబుతానని జేసీ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తలచెడిందని వైద్యం చేయించాలని జేసీ ఎద్దేవా చేశారు.
ఇటీవల 22 వేల కార్లు హిమాచల్ ప్రదేశ్‌లో పట్టుకున్నారన్నారు. 28 వాహనాలను కొనుగోలు చేస్తే156 కేసులు పెట్టారన్నారు. ఎమ్మెల్యే ఏది పడితే అది మాట్లాడుతాడన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారి తనపై కేసు పెట్టారని.. దమ్ముంటే తనపై మరో కేసు పెట్టాలని సవాల్ విసిరారు. ఇప్పటికే తాను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చానన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.