Begin typing your search above and press return to search.

18 ఏళ్లకే అమెరికాలో మేయర్.. అతిపిన్న వయస్కుడు.. ఎవరితను?

By:  Tupaki Desk   |   9 Dec 2022 2:30 AM GMT
18 ఏళ్లకే అమెరికాలో మేయర్.. అతిపిన్న వయస్కుడు.. ఎవరితను?
X
ఎర్లే పౌరులు మంగళవారం రాత్రి 18 ఏళ్ల జేలెన్ స్మిత్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. అమెరికా చరిత్రలో ఎన్నుకోబడిన అతి పిన్న వయస్కుడైన నల్లజాతి మేయర్‌గా ఇతడు నిలిచారు. ఎర్లే, అర్కాన్సాస్‌లో సుమారుగా 2,000 మంది జనాభా ఉన్నారు. ఇది మెంఫిస్ వెలుపల 30 మైళ్ల దూరంలో ఉంటుంది.

తన గెలుపును పురస్కరించుకుని ఓట్లు వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్‌బుక్ ఖాతాలో జేలెన్ పోస్ట్ చేశారు. "ఎర్లే, అర్కాన్సాస్ పౌరులకు కృతజ్ఞతలు. ఇది అధికారికం! నేను అర్కాన్‌సాస్‌లోని ఎర్లేకి కొత్తగా ఎన్నికైన మేయర్‌ని... ఎర్లే, అర్కాన్సాస్‌లో ఒక మంచి అధ్యాయాన్ని నిర్మించాల్సిన సమయం వచ్చింది."

మద్దతచ్చిన ప్రజలకు.. నా మద్దతుదారులందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను నిజంగా కృతజ్ఞుడను' అని జేలెన్ స్మిత్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశాడు.

ఇటీవలే మే 2022లో ఉన్నత పాఠశాల నుంచి పట్టభద్రుడైన స్మిత్, ఎర్లే అభివృద్ధికి సంబంధించిన తన ప్రణాళికలను వివరించాడు. "మొదట, నేను ఇక్కడ ప్రజల భద్రతను మెరుగుపరచాలనుకుంటున్నాను. రెండవది, పాడుబడిన ఇళ్లను కూల్చివేస్తాను. సమాజానికి ఇక్కడ రవాణా, ఇక్కడ నిత్యావసరాలు దగ్గరయ్యేలా చేస్తాను" అని అతను మొదటి హామీ ప్రకటించారు.

ఎర్లే అర్కాన్సాస్ ఒక చిన్న పట్టణం అయినప్పటికీ 18 ఏళ్లకే ఒక యువకుడు మేయర్ కావడం మాత్రం అమెరికా వ్యాప్తంగా సంచలనమైంది. అంత చిన్న వయసులో ఒక ప్రాంతానికి మేయర్ అయ్యాడంటే అతడి శక్తి సామర్థ్యాలపై చర్చ నడుస్తోంది.

ఈ విషయంలో భారతదేశం చాలా దూరంలో ఉంది. ఇక్కడి యువత అసలు రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయాలలో ప్రగతిశీల , సమూలమైన మార్పును సూచించే రాజకీయ ప్రతినిధిగా ఒక యువకుడిని చూడటం ఎప్పుడైనా ఉత్సాహానిస్తుంది. భారత్ లోనూ ఇలాంటి యువత రావాలని ఆశిద్ధాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.