Begin typing your search above and press return to search.

క‌లెక్ట‌ర్ పిలుపు : గొడ్డు..పంది మాంసం తినండి!

By:  Tupaki Desk   |   25 March 2017 8:00 AM GMT
క‌లెక్ట‌ర్ పిలుపు : గొడ్డు..పంది మాంసం తినండి!
X
ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అది ఆహారం విష‌యంలో కావ‌చ్చు, మ‌త‌పర‌మైన స్వేచ్చ కావ‌చ్చు, భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అయినా అయి ఉండ‌వ‌చ్చు. కానీ రాజ్యాంగ బద్ద‌మైన ప‌ద‌వుల్లో ఉన్న‌వారు త‌మ అభిప్రాయాలను వ్య‌క్త‌ప‌ర్చ‌డంతో కాస్త జాగ్ర‌త్త వ‌హించాలి. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు త‌న అభిప్రాయాల‌ను సందేశంగా చెప్ప‌డం విష‌యంలో వివాదాస్ప‌ద అంశాల జోలికి వెళ్ల‌కూడదు. కానీ తెలంగాణ‌లోని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి దీనికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హరించారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఏటూరునాగారం మండలకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో క‌లెక్ట‌ర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఈ ర్యాలీలో కలెక్టర్ మురళి మాట్లాడుతూ...."అడవి పంది, గొడ్డు మాంసం పుష్కలంగా తినండి. కంది పప్పు తినండి. ఇవి తింటే బలం, క్షయ దరిచేరదు. మాంసం ఎక్కువ ఖరీదు అనుకుంటే పక్కనే ఉన్న అడవి పందులను పట్టుకొని తినండి. దరిద్రపు బ్రాహ్మనిజం కల్చర్ వచ్చి, పెద్ద మాసం తినొద్దు. అదీ, ఇదీ, గాడిద గుడ్డు అని చెప్పి బంద్ చేయించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేను పల్లెనిద్ర చేసినపుడు ముసలివాళ్లు చెప్పారు... గొడ్డు కూర తినాలని ఉన్నా , ఊళ్లో తిననీయడం లేదు, ప్రాణం కొట్టుకుంటున్నదన్నారు. గొడ్డు కూర తిన్నపుడు వ్యవసాయం, కూలిపని బాగా చేసేవాళ్లమని, ఎప్పుడైతే తినడం ఆపామో ఒంట్లో సత్తువ లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ములుగు మండలం అంకన్నగూడెంకు వెళ్లినప్పుడు కొందరు ఆ దేవుడు, ఈ దేవుడు పేరిట పిచ్చిమాలలు వేసుకుని పందిమాంసం తినడం బంద్‌చేశారు. ఏందో మాల వేసుకుంటున్నారంటా! అదేందో గాడిదగుడ్డు, అదంతా వేస్ట్. హ్యాపీగా మనం ఏం తినాలో అదేతినాలి. అప్పుడే శరీరం బాగుంటుంది. అడవి పందులు పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అడవి పంది మాంసం తినొచ్చని, వాటిని పట్టుకోవచ్చని ఈ మధ్య కేంద్ర అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. ఇది నేరం కాదు. నెమలి, దుప్పి, ఇతర మాంసం మాత్రం తినొద్దు. అడవి పందిని తింటే ఎలాంటి కేసులు లేవు. సమస్యలు లేవు. ఎప్పుడైనా పందిమాంసం వస్తే నాకు కూడా పెట్టండి.. నేను ఎప్పుడూ తినలేదు# అని కలెక్టర్ మురళి వ్యాఖ్యానించారు.

కాగా కలెక్టర్‌ వ్యాఖ్యలపై నిర‌స‌న‌లు మొద‌ల‌వ‌డంతో ఆయ‌న క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసమే అలా మాట్లాడానని, ఈ సందర్భంగా దీక్షలు మానుకోవాలని, బ్రాహ్మనిజం అనే పదాలు వాడినందుకు క్ష‌మించాల‌ని అన్నారు. మొత్తానికి నోరు జారిన త‌రువాత క్ష‌మాప‌ణ‌లు చెప్పినా అంత తేలిగ్గా పోతుందా.. ఏం జ‌రుగుతుందో చూద్దాం.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/