Begin typing your search above and press return to search.

జగన్ సంకల్పం ఓకే.. అడ్డంకులు అవే: జేపీ

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:23 PM IST
జగన్ సంకల్పం ఓకే.. అడ్డంకులు అవే: జేపీ
X
దేశవ్యాప్తంగా దుమారం రేపిన దిశ ఉదంతంలో మహిళలకు రక్షణగా ఏపీలో దిశ చట్టం తెచ్చిన జగన్ నిర్ణయాన్ని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్వాగతించారు. జగన్ సంకల్పం బాగుందని..ఈ చట్టం చేయడం చాలా మంచిదని.. కానీ అత్యాచారాలు అరికట్టడానికి ఈ చట్టం సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు.

సమాజంలో చిన్న చిన్న నేరాలను నియంత్రించాలని.. వెంటనే శిక్ష పడుతుందన్న భయం కలిగించినప్పుడే నేరాలు తగ్గుతాయని జేపీ అన్నారు. స్థానిక న్యాయాలయాల ద్వారా సత్వరమే చర్యలు తీసుకోవచ్చన్నారు. వాటిని ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరానన్నారు. వారం రోజుల్లోనే కేసులను పరిష్కరించడం సాధ్యం కాదని.. నిందితులు దొరకకపోవచ్చన్నారు.

నేరవిచారణ జరిగే తీరును మార్చకపోతే ఎన్ని చట్టాలు చేసినా నేరాలకు 15రోజులు లేదా నెల రోజుల్లోనే తీర్పులు రావని జేపీ స్పష్టం చేశారు. వాజ్ పేయి హయాంలో తెచ్చిన మాలిమత్ కమిటీ నివేదికను అమలు చేయాలని ఆయన కోరారు.

దిశ ఎన్ కౌంటర్ విషయంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భయం ఏర్పడిందని.. కేసీఆర్ నిర్ణయానికి జగన్ జైకొట్టడం భావోద్వేగమన్నారు జేపీ. ఎన్ కౌంటర్ లాటి తక్షణ న్యాయం వల్ల ప్రమాదమేనని అన్నారు.