Begin typing your search above and press return to search.

ఇడియట్స్‌ ఎవరు? జేపీ సార్‌ కోపం ఎవరి మీద?

By:  Tupaki Desk   |   28 Jun 2015 10:24 AM IST
ఇడియట్స్‌ ఎవరు? జేపీ సార్‌ కోపం ఎవరి మీద?
X
ఇడియట్స్‌, జోకర్స్‌, పనిలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను భ్రష్టు పటిస్తున్నారు.. అని ధ్వజం ఎత్తాడు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ. సామాజిక అంశాలపై ప్రసంగిస్తూ జేపీ ఈ వ్యాఖ్యానాలు చేశారు. మరి ఈ కోపం ఎవరిమీదనో అర్థం కావడం లేదు. ఇడియట్స్‌, జోకర్స్‌, పనిలేని వ్యక్తులు..అంటూ జేపీ సార్‌ విరుచుకుపడటం బాగానే ఉంది. అలాంటి వారంతా రాజకీయాల్లోకి రావడం వల్లనే వ్యవస్థ ఇలా నాశనం అవుతోందని ఆయన ధ్వజమెత్తడం కూడా బాగుంది. అయితే ఆ ఇడియట్స్‌, జోకర్స్‌, పనిలేని వ్యక్తులు ఎవరో మాత్రం అర్థం కావడం లేదు. ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఉద్దేశంచి జేపీ గారు ఇలా విరుచుకుపడ్డారో ఏమో కానీ... జేపీ వ్యాఖ్యలు అయితే ఆయన రొటీన్‌ స్టైల్‌లోనే ఉన్నాయి.

అలాగే ఓటుకు నోటు వ్యవహారం గురించి కూడా జేపీ మరోసారి ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తూ వస్తున్న జేపీ ఇప్పుడు కూడా మళ్లీ దాన్నే కంటిన్యూ చేశారు.

ముఖ్యమంత్రులిద్దరికీ కూడా పాలనపై శ్రద్ద లేదని.. ఎంతసేపూ రాజకీయాలే అని, అధికారాన్ని అందుకోవాలి, నిలబెట్టుకోవాలనే అంశం గురించినే వారు దృష్టిసారిస్తున్నారని.. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒకర్నొకరు రెచ్చగొట్టుకొనే ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ వాళ్లు పబ్బం గడుపుకొంటున్నారని జేపీ విమర్శలు చేశారు.

ఇక విద్యావిధానం, పారిశ్రామిక విధానాల్లోని లోపాల గురించి కూడా జేపీ గారు ప్రసంగించారు. మరి ఇలాంటి ప్రసంగాల కన్నా ప్రభుత్వ ధోరణిలో ఆలోచనరేపేలా ఏదైనా చేయగలిగితే మేలేమో!