Begin typing your search above and press return to search.

బీజేపీ భజన ఫలితం: చంద్రబాబుది పిచ్చితనం...

By:  Tupaki Desk   |   20 Jan 2015 10:30 PM GMT
బీజేపీ భజన ఫలితం: చంద్రబాబుది పిచ్చితనం...
X
వ్యవసాయం దండగ అని ఎప్పుడో అన్నారన్న ఒక్క మాట వల్ల దాదాపు 10ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు చంద్రబాబు! బాధ్యతగల నాయకుడు మాట్లాడిన మాటకు అంత విలువ ఉంటుంది! ఆ మాట నిజంగా బాబు అన్నారో లేదో కానీ... వైఎస్సార్‌ మాత్రం ఆ మాటను ఒక రేంజ్‌ లో వాడేశారు! తర్వాతి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కాస్త దూరం పాటిస్తూనే వచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు! అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయాలు, వరాల ప్రకటనలు మాత్రమే చేసిన బాబు.. తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి! దీనిపై జయప్రకాశ్‌ నారాయణ, జనచైత్యన్య వేదికలు బాబు ని ఏకిపారేస్తోన్నాయి!

ఎక్కువ మంది పిల్లలను కనాలి అన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్‌ నారాయణ, జనచైతన్య వేదికలు మండిపడుతున్నాయి! టెక్నాలజీ ముఖ్యమంత్రిని, ఏపీలో ఐటీ ఆద్యుడిని అని చెప్పుకునే బాబు ఇలా దిగజారిన మాటలు, అనాలోచితమైన మాటలు మాట్లాడం ఏంటని వీరు ప్రశ్నిస్తున్నారు! జనాభా పెంచాలని చెప్పడం కచ్చితంగా పిచ్చితనమే అని బాబుని ఏకిపారేస్తోన్నారు! ఈ పిలుపు వెనుక ఉద్దేశ్యమేమిటో కానీ, అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని అంటోన్న జేపీ... జనాభా పెంచుకోవాలంటూ పిలుపునివ్వడం పిచ్చితనమని, ఆత్మహత్యాసదృశ్యమని అంటున్నారు!

అయితే... ప్రస్తుతం ఉన్న యువతకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతునారు, దేశాభివృద్దికి జనాబా పెరుగుదల కచ్చితంగా అతి పెద్ద సమస్యే! అటువంటప్పుడు ఇంకా ఎక్కువ మంది పిల్లలని కనాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తోన్నారు! ఇదే విషయంపై జనచైతన్య వేదిక కూడా బాబుని ఏకిపారేస్తోంది! బాబు గారు చేసిన ఈ అనవసర, అప్రస్థుత, వివాదాస్పదవ్యాఖ్యలు బాబు గారి భవిష్యత్తును ఎలా మార్చయోతోన్నాయో వేచి చూడాలి!

అయితే చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలను భాజపాను భజన చేయడానికే అన్నారా? అనే వాదన కూడా వినిపిస్తోంది. హిందువుల సంఖ్య పెరగడమే లక్ష్యం అన్నట్లుగా... భాజపాకు చెందిన పలువురు నాయకులు.. ఇప్పటికే ఎక్కువమందిని కనడం గురించి... రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వారి భావజాలాన్ని భజన చేయడానికన్నట్లుగా.. ఇద్దరికంటె ఎక్కువమందిని కనాలని చెప్పడం ద్వారా చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కేంద్రాన్ని భజన చేయడం అవసరమే కావచ్చు.. కానీ.. ఇలా ముందువెనుక చూసుకోకుండా బురదలో దిగితే ఆయనకే ఇబ్బంది అని పలువురు సలహా చెబుతున్నారు.