Begin typing your search above and press return to search.

సొంత‌గూటికి జ‌య‌ప్ర‌ద‌

By:  Tupaki Desk   |   21 May 2016 12:16 PM IST
సొంత‌గూటికి జ‌య‌ప్ర‌ద‌
X
ప్రముఖ సినీ నటి - మాజీ ఎంపీ జయప్రద త‌న సొంత గూటికి చేర‌నున్నారు. ఆమె తిరిగి సైకిల్ ఎచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం. అయితే ఆ సైకిల్ తెలుగు రాష్ర్టాల్లోని సైకిల్ పార్టీ కాదండోయ్. ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్‌ లోని ఆమె పూర్వాశ్ర‌మ‌మైన స‌మాజ్‌ వాది పార్టీ. ఆ రాష్ట్రంలో ఎస్పీ గుర్తు సైకిల్ అనే సంగ‌తి తెలిసిందే.

జ‌య‌ల‌లిత రాజ‌కీయ గురువు అమర్ సింగ్ సమాజ్‌ వాదీ పార్టీలోకి తన పునరాగమాన్ని ఘనంగా చాటారు. పార్టీలో బడా నేతలు వ్యతిరేకించినప్పటికీ రాజ్య‌స‌భ‌ సీటు దక్కించుకుని సత్తా చాటారు. ఆయనతో పాటు సమాజ్‌ వాది పార్టీకి దూరమైన జ‌య‌ల‌లిత కూడా మళ్లీ ఎస్‌పీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ అడుగు పెట్టేందుకు జయప్రద గ‌త ఏడాది కాలంగా ప్ర‌యత్నిస్తున్నారు. అయితే అది ఆచ‌ర‌ణ‌లో విజ‌యం సాధించ‌లేదు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్ సొంత గూటికి చేరడంతో ఆమెకు అనుకూలించే పరిణామంగా విశ్లేషిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె మళ్లీ యూపీ వైపు మళ్లనున్నారని తెలుస్తోంది. తనకు మెంటర్ - ఫ్రెండ్ - ఫిలాసఫర్ - గైడ్ అయిన అమర్ సింగ్ మార్గాన్నే ఆమె అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమర్ సింగ్ పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆజాం ఖాన్ - రామ్‌ గోపాల్ యాదవ్.. జయప్రద రాకకు మోకాలడ్డే అవకాశం ఉంది. అయితే ఎంద‌రు వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ అమ‌ర్‌ సింగ్‌ సొంత గూటికి చేరుకుని రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవడంతో జయప్రద త‌న‌కు ఎస్పీ ఎంట్రీ క‌ష్టం కాద‌ని భావిస్తున్నారు. 'బాస్' అమర్ సింగ్ తలచుకుంటే జయప్రదకు మళ్లీ యూపీ పాలిటిక్స్‌ లో మెరుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.