Begin typing your search above and press return to search.

ఆజంఖాన్ కు తగిన శాస్తి జరిగింది.. యూపీలో జయప్రద ఎంట్రీ

By:  Tupaki Desk   |   21 Feb 2023 1:00 PM GMT
ఆజంఖాన్ కు తగిన శాస్తి జరిగింది.. యూపీలో జయప్రద ఎంట్రీ
X
చట్టం.. న్యాయం లాంటివి లైట్ తీసుకోండి. నేను చెప్పేదే న్యాయం.. నేను చెప్పేదే ధర్మం. నన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికి లేదు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే అతి కొద్ది నేతల్లో యూపీకి చెందిన ఆజాంఖాన్ ఒకరు. మోడీ అండ్ కోపై పెద్ద ఎత్తున విరుచుకుపడే ఆయన.. ప్రధాని పట్ల ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. ఎవరైనా సరే.. నాకేంటి? నాకు ఎదురేంటి? అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. ఒక ఎంపీ ఇంతలా బరితెగింపు ధోరణితో వ్యవహరించటమా? అన్న ప్రశ్న ఎదురయ్యేది. కానీ.. చట్టం మాత్రం ఏమీ చేయకుండా ఊరుకునేది.

అలాంటి పరిస్థితుల్లో ఆయనపై వచ్చిన ఒక ఫిర్యాదు ఆయన జీవితాన్ని మాత్రమే కాదు.. ఆయన కుమారుడికి దిమ్మ తిరిగేలా జైలుశిక్షను అనుభవిస్తున్న పరిస్థితి. 2019 లోక్ సభ ఎన్నికల వేళలో నటి కమ్ రాజకీయ నాయకురాలు జయప్రద పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజాంఖాన్ పై ఎప్ఐఆర్ నమోదైంది.

యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన చేసిన విద్వేష వ్యాఖ్యలకు మూల్యం చెల్లిస్తూ.. కోర్టులో ఆయనకు మూడేళ్లు జైలుశిక్ష పడింది. దీంతో ఆయన జైలుకు పరిమితమయ్యారు.

మూడేళ్లు జైలు పడటంతో ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడయ్యారు. ఇక.. ఆయన కుమారుడు సైతం ఒక ధర్నా కేసులో జైలుపాలయ్యారు. రెండేళ్లుజైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇలా ఆజాంఖాన్.. ఆయన కుమారుడు ఇద్దరు జైలుకు పరిమితం కావటంతో.. ఇద్దరికి అసెంబ్లీ సభ్యత్వాలను పోగొట్టుకున్నారు.

ఇలాంటివేళ.. ఎంట్రీ ఇచ్చిన జయప్రద.. తాజాగా ఆజాంఖాన్ పై ఘాటుగా రియాక్టు అయ్యారు. చేసిన పాపాలకు మూల్యం చెల్లిస్తున్నారన్న జయప్రద.. రాజకీయ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అధికార గర్వం ఉండకూడదన్నారు.

ఆజాంఖాన్ కు.. ఆయన కుమారుడు (అబ్దుల్లా ఆజం)కు మహిళల్ని ఎలా గౌరవించాలో తెలీదు.. వారి పని అయిపోయింది.. వారు చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పదు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆజాంఖాన్.. ఆయన కుమారుడు ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తూ ఉండిపోయారు. ఇలాంటి వేళలోనే ఎంట్రీ ఇచ్చిన జయప్రద తండ్రికొడుకులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.