Begin typing your search above and press return to search.

బాలయ్యకు పదవి ఇవ్వాలని బాబుకే చెప్పాలా?

By:  Tupaki Desk   |   28 Feb 2016 10:21 AM IST
బాలయ్యకు పదవి ఇవ్వాలని బాబుకే చెప్పాలా?
X
ఇప్పటివరకూ బాబుకు ఎదురుకాని సన్నివేశం ఒకటి ఆయనకు ఎదురైంది. హీరో కమ్ పొలిటీషియన్ బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలు అనంతపు జిల్లా హిందుపురంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు వచ్చారు. అలా వచ్చిన అతిధుల్లో ఏపీకి చెందిన వారితో పాటు కర్ణాటకకు చెందిన వారూ ఉన్నారు. వీరంతా లేపాక్షి ఉత్సవాల్ని నిర్వహిస్తున్న తీరును.. బాలయ్యను విపరీతంగా పొగిడేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అలనాటి సినీనటి జయంతి మాట్లాడుతూ చంద్రబాబుకు ఆసక్తికర విన్నపం చేశారు.

బెంగళూరులో ఉన్న తనను గుర్తు పెట్టుకొని మరీ బాలకృష్ణ ఆహ్వానించారన్న ఆమె.. ఎంతో రిస్క్ తీసుకొని ఆయనీ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను ఒక విన్నపం చేస్తున్నానని చెబుతూ.. బాలయ్యను చప్పున ముఖ్యమంత్రిని చేసేయాలన్నారు. చంద్రబాబు దగ్గర బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని పబ్లిక్ గా అడగటం ఇదే తొలిసారి. అయినా.. బావమరిది కమ్ వియ్యంకుడైన బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని బయటవాళ్లు బాబు విన్నపం చేసే దాకా తెచ్చుకోవటం ఏమిటి? ఒకవేళ ఏదైనా పాలసీ ఉంటే.. ఆ విషయాన్ని బాబు స్పష్టం చేస్తే బాగుంటుంది కదా. అయినోళ్లకు పదవులు ఇచ్చేందుకు బాబు ఎందుకు సందేహిస్తున్నారు?