Begin typing your search above and press return to search.
అమ్మ జీవితం మిస్టరీ.. కేసు క్లోజ్ చేసిన హైకోర్టు!
By: Tupaki Desk | 13 Oct 2018 7:27 AM GMTతమిళ ప్రజల మనసుల్లో అమ్మగా నిలిచిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వివాదాలెన్నో ఆమె వెళ్లిపోయిన తర్వాత బయటకు రావటం తెలిసిందే. ఆమె బతికున్న వేళ.. ఆమెకు సంబంధించిన ఒక్క మాట మాట్లాడాలంటే వణికిపోయే పరిస్థితి. అలాంటిది అమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన తర్వాత ఒక్కొక్క వివాదం తెర మీదకు వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అమృత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. జయలలితను తల్లిగానే ఎందుకు కోరుతున్నారు? శోభన్ బాబును తండ్రిగా ఎందుకు పేర్కొనటం లేదు? అని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
దీనికి స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. అమృత జయ కుమార్తె కాదన్న ఆధారాల్ని చూపే వీడియోను ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు.. జయ జీవితం మొత్తం మిస్టరీతో కూడుకున్నదని పేర్కొంటూ అమృత పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. దీంతో.. అమ్మకు సంబంధించిన ఒక వివాదానికి పుల్ స్టాప్ పడినట్లుగా చెప్పక తప్పదు.
అలాంటి వాటిల్లో ఒకటి.. జయలలిత తల్లిగా బెంగళూరుకు చెందిన యువతి అమృత కోర్టు మెట్లు ఎక్కారు. జయలలిత కుమార్తెగా తననుగుర్తించాలని.. కావాలంటే తన డీఎన్ ఏ శాంపిల్ ను.. అమ్మ మృతదేహం నుంచి సేకరించి పరీక్షలు జరపాలని కోరారు. జయ తనకు జన్మనిచ్చిన తల్లి అని.. తాను శోభన్ బాబు.. జయకు పుట్టిన బిడ్డనని ఆమె వాదించారు. ఆమె భౌతికాయానికి మళ్లీ అంత్య్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అమృత హైకోర్టును ఆశ్రయించింది.