Begin typing your search above and press return to search.

జ‌య తండ్రిని చంపేశార‌ట‌!

By:  Tupaki Desk   |   5 Dec 2017 4:14 AM GMT
జ‌య తండ్రిని చంపేశార‌ట‌!
X
కొన్నిసార్లు అంతే. ఏళ్ల‌కు ఏళ్లుగా స‌మాధి అయిన నిజం ఒక్క‌సారి తెర మీద‌కు వ‌స్తుంది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే. త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని తిరుగులేని రీతిలో న‌డిపిన అమ్మ జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆమె బ‌తికున్న కాలంలో ఆమె జీవితానికి సంబంధించిన అంశాలు.. ఆమె కుటుంబానికి సంబంధించిన అంశాల్ని ప్ర‌స్తావించే ధైర్యం కూడా చేయ‌లేక‌పోయేవారు.కానీ.. ఇప్పుడు అదే ప‌నిగా భారీ ఎత్తున క‌థ‌నాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి.

దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబుతో జ‌య‌ల‌లిత స‌హ‌జీవ‌నం చేశార‌ని.. అందుకు గుర్తుగా వారికో పాప పుట్టింద‌ని.. ఆమె పేరు అమృత అన్న క‌థ‌నాలు ఈ మ‌ధ్య‌న జోరుగా వ‌స్తున్నాయి. తాను అమ్మ కూతురిన‌ని.. కావాలంటే తాను డీఎన్ ఏ ప‌రీక్ష‌కు సైతం సిద్ధ‌మ‌ని ఆమె చెబుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇలాంటి వేళ మ‌రో సంచ‌ల‌న అంశం తెర మీద‌కు వ‌చ్చింది. జ‌య తండ్రి జ‌య‌రామ‌న్ ను ఆయ‌న భార్య చేతిలోనే హ‌త్య‌కు గుర‌య్యార‌న్న సంచ‌ల‌న అంశం తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది. జ‌య వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల్ని ప్ర‌స్తావించే ధైర్యం ఆమె బ‌తికి ఉన్న‌ప్పుడు ఎవ‌రూ చేయ‌లేదు.

ఈ రోజున మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. పోయిన మ‌నిషి ఏమీ చేయ‌లేర‌న్న ధైర్యం కావొచ్చు.. నిజాన్ని ఇప్ప‌టికైనా బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న ఆస‌క్తి కావొచ్చు. మొత్తంగా అయితే ఇంత‌కాలం గుట్టుగా ఉన్న విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

జ‌యకు సంబంధించిన ప‌లు వివాదాస్ప‌ద అంశాల్ని వెల్ల‌డిస్తున్నారు బెంగ‌ళూరులో నివ‌సిస్తున్న ఆమె అత్త ల‌లిత‌. ఇటీవ‌ల త‌మిళ న్యూస్ ఛాన‌ల్ స‌న్ న్యూస్ తో మాట్లాడిన ఆమె.. జ‌య‌ల‌లిత‌కు ఒక ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించారు. త‌న పెద్ద‌మ్మే జ‌య‌కు పురుడు పోసింద‌న్నారు.ఆ విష‌యాన్ని ఎవ‌రికి చెప్పొద్ద‌ని ఒట్టు వేయించుకున్నార‌న్నారు.

అయితే.. జ‌య కుమార్తె అని చెప్పుకునే అమృతే ఆమె కూతుర‌న్న విష‌యం త‌న‌కు తెలీద‌న్నారు. అందుకు సంబంధించిన ఆధారం త‌న ద‌గ్గ‌ర లేద‌న్నారు. ఇక‌.. జ‌య తండ్రిని ఆమె త‌ల్లి సంధ్యే చంపేసింద‌న్నారు. జ‌య తండ్రి జ‌య‌రామ‌న్ మ‌ద్యానికి బానిస కావ‌టంతో దూరంగా ఉంచార‌ని.. జ‌య త‌ల్లి సంధ్యే విష‌మిచ్చి భ‌ర్త‌ను చంపిన‌ట్లుగా ఆరోపించారు. జ‌య ఇగో.. జ‌య‌రామ‌న్ హ‌త్య నేప‌థ్యంలో తాము దూరంగా ఉండిపోయామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌య వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి వ‌చ్చిన వార్త‌ల‌కు ఆమె తండ్రి హ‌త్య‌కు గుర‌య్యార‌న్న వార్త పూర్తి భిన్న‌మైనద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.రానున్న రోజుల్లో మ‌రెన్ని కొత్త విష‌యాలు తెర మీద‌కు రానున్నాయో?