Begin typing your search above and press return to search.

జయలలిత ఆస్తులు అటాచ్‌

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:35 PM GMT
జయలలిత ఆస్తులు అటాచ్‌
X
రామేశ్వరం పోయినా శనీశ్వరం వదల్లేదు అన్నట్లుగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి చనిపోయినా ఆమె మీదున్న కేసులు మాత్రం ఇంకా కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత గతంలో ఆదాయపు పన్ను సరిగ్గా కట్టలేదు. అది 2018 డిసెంబర్‌ 31 నాటికి దాదాపు రూ.10.12 కోట్లు అయ్యింది. అయితే.. ఈ డబ్బుని వసూలు చేసేందుకు ఆదాయపు పన్ను అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మద్రాస్‌ హై కోర్టు ప్రశ్నించింది. దీనికి రెస్పాండ్‌ అయిన ఐటీ అధికారులు.. జయలలితకు చెందిన పోయెస్‌ గార్డెన్‌ లోని వేదనిలయంతో సహా మరో నాలుగు ఆస్తులను అటాచ్‌ చేసినట్లు కోర్టుకు తెలిపారు.

ఇన్‌ కం ట్యాక్స్‌ చెల్లించాలని 2007లో పోయెస్ గార్డెన్ లోని ఇంటికి, 2013లో చెన్నైలోని సెయింట్ మ్యారీస్ రోడ్డులోని చెందిన ఇంటికి నోటీసులు జారీ చేశామని ఆదాయపు పన్ను అధికారులు కోర్టుకు విన్నవించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఆమె పన్ను కట్టులేదని మద్రాసు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అందువల్లే వేదనిలయంతో సహా మరో నాలుగు ఆస్తులను అటాచ్‌ చేసినట్లే చెప్పారు. వాటి వేలం ద్వారా వచ్చే డబ్బుని పన్ను రూపంలో మినహాయించుకుంటామని చెప్పారు.