Begin typing your search above and press return to search.

'అమ్మ' పేరున మరో బంఫర్ ఆఫర్!

By:  Tupaki Desk   |   17 Sept 2016 3:43 PM IST
అమ్మ పేరున మరో బంఫర్ ఆఫర్!
X
తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని - తన మార్కు ఎప్పటికీ రాష్ట్రంపైనా - రాష్ట్ర ప్రజలపైనా చెరిగిపోకుండా నిలవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పబ్లిసిటీ విషయంలో ఆమె తర్వాతే ఎవరైనా అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమ్మ బ్రాండ్ లతో ఇప్పటికే తమిళనాడులో ప్రతీ చిన్న విషయంలోనూ తన మార్కును చూపించిన జయలలిత తాజాగా మరో బంఫర్ ఆఫర్ ప్రకటించారు. అవే.. అమ్మ కల్యాణ మండపాలు.

త్వరలో తమిళనాడు ప్రజలకు అమ్మ కల్యాణ మండపాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రూ.83 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో ఈ కల్యాణ మండపాలను నిర్మించనుంది. ఈ కల్యాణ మండపాలు పేద - సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.. వీటిలో వివాహాలు చేసుకోవాలనుకునేవారు ఆన్ లైన్ లో ఈ మండపాలను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు వీలైనంత త్వరలో ఈ కల్యాణ మండపాల నిర్మాణాలు - రాష్ట్ర హౌసింగ్ బోర్డు - సహకార సంఘాలు ఆధ్వర్యంలో చేపట్టి పూర్తిచేయాలని జయలలిత భావిస్తున్నారట.

ఈ కల్యాణ మండపాలు ఏదో ముఖస్తుతి కోసం కట్టేవిగా ఉండకుండా... వీటిలో ప్రత్యేక గదులను కూడా నిర్మించనున్నారు. వరుడు - వధువులతో పాటు అతిథి గదులు - భోజనశాల ఉండేలా ఏర్పాటు చేస్తున్న ఈ కల్యాణ మండపాల్లో ఎయిర్ కండిషనర్ సదుపాయం కూడా ఉంటుంది. కాగా జయలలిత ఆ రాష్ట్ర ప్రజలకోసం ‘అమ్మ’ క్యాంటీన్లు - ‘అమ్మ’ వాటర్ - ‘అమ్మ’ మెడికల్ షాపులు - ‘అమ్మ’ కూరగాయలు - ‘అమ్మ’ సిమెంట్ - ‘అమ్మ’ ఉప్పు - 'అమ్మ' జిమ్ లు.. ఇలా పలు పథకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే!