Begin typing your search above and press return to search.
'అమ్మ' పేరుతో ఇవి కూడా వచ్చేశాయ్
By: Tupaki Desk | 30 Aug 2016 9:30 AM GMTతమిళనాట ‘అమ్మ’ పేరిట పలు జనాకర్షక పథకాలు ప్రారంభించిన అన్నాడీఎంకె ప్రభుత్వం మరో మందడుగు వేసింది. సాధారణంగా పురుషులు మాత్రమే ఆలోచించే శారీర సౌష్టవం గురించి జయలలిత ఆలోచించారు. ఆలోచించే ఆగిపోలేదు. అమ్మ జిమ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇదొక్కటే కాదు...అమ్మ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత ఈ ప్రకటనలు చేశారు.
గ్రామీణ ప్రాంత యువతలో శారీరక - మానసిక పరిస్థితిని పెంపొందించడానికి వీటిని ఏర్పాటు చేయతలపెట్టామని జయలలిత సభాముఖంగా ప్రకటించారు. 50కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఒక్కో జిమ్ కు పది లక్షల వ్యయం అవుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో 500 అమ్మ పార్కులు పెడుతున్నారు. పిల్లలు ఆడుకోడానికి పరికరాలు - హాయిగా గడపడానికి అనువైన సదుపాయాలు పార్కుల్లో ఉంటాయని జయ చెప్పారు. వీటిల్లో టాయిలెట్లు - సిమెంట్ బెంచ్ లు - వాకింగ్ చేయడానికి అనువైన సౌకర్యాలు సమకూర్చుతారు. వంద కోట్ల రూపాయలతో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రోగాలతో జిల్లా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చికిత్సపొందుతున్న వారి తరఫున వచ్చే బంధువుల కోసం తాత్కాలిక ఆవాస కేంద్రాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. చెన్నైతోపాటు జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. 11.62 కోట్ల రూపాయలు వీటి కోసం వెచ్చిస్తామని జయ పేర్కొన్నారు. మున్సిపాల్టీల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పారు. తొలి విడతగా పది కార్పొరేషన్లు - 37 మున్సిపాల్టీల్లో ఫ్లోరోసెంట్ బల్బులను మార్చి ఎల్ ఈడీలను అమర్చుతారని జయలలిత ప్రకటించారు.