Begin typing your search above and press return to search.
సీఎం లేని కేబినెట్ మీటింగ్
By: Tupaki Desk | 19 Oct 2016 7:23 AM GMTఏంటి? ఆశ్చర్య పోతున్నారా? నిజంగానే ఇప్పుడు తమిళనాడులో సీఎం జయలలిత లేకుండానే మంత్రి వర్గం కొలువుదీరింది. గత నెల 22న తీవ్ర అనారోగ్యంతో జయ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే, రాష్ట్రంలో పాలన స్తంభించకుండా ఉండేందుకు సీఎం శాఖలను ఆర్థిక మంత్రి - అమ్మకు నమ్మిన బంటు పన్నీర్ సెల్వానికి అప్పగించారు. దీంతో ఆయనే ఇప్పుడు అమ్మ శాఖలను కూడా డీల్ చేస్తున్నారు. ఇక, కావేరీ జల వివాదం రాష్ట్ర రాజకీయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
కర్ణాటకకు సుప్రీం కోర్టు ఈ విషయంలో పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేసినా తమిళనాడుకు ఉపశమనం లభించలేదు. ఈ విషయానికి కాస్త పొలిటికల్ రంగులద్దిన డీఎంకే పార్టీ రైల్ రోకో కూడా నిర్వహించింది. మరోపక్క - మరోవైపు నీళ్లు విడుదల చేయలేమంటూ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారించనుంది. వీటి నేపథ్యంలో తమిళనాడు ప్రయోజనాలు దెబ్బతినకుండా - అదే సమయంలో ప్రతిపక్షాలను సైతం నిలువరించేలా ఏం చేస్తే బాగుంటుంది? అనేదానిపై ప్రభుత్వం తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ క్రమంలో అమ్మ లేకుండానే కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం డిసైడ్ అయ్యారు. జయ శాఖలు సెల్వానికి బదిలీ అయ్యాక జరుగుతున్న తొలి కేబినెట్ మీటింగ్ కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా తమిళనాడులోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపైనా పన్నీర్ సెల్వం మంత్రివర్గంతో చర్చిస్తారని సమాచారం.
అయితే, మంత్రివర్గం మీటింగ్ అజెండా ఏదీ బయటకు రాకపోయినా, ప్రస్తుత పరిస్థితులను బట్టి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నకావేరీ జలాల విషయంపై ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై గతంలో జయ దూకుడుగానే వెళ్లారు. మరి ఇప్పుడు పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాన్ని బట్టి స్టేట్ లో పాలిటిక్స్ ఊపందుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ కోసం వెయిట్ చేయకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/