Begin typing your search above and press return to search.

ఫ్లిప్‌కార్ట్ లో ‘అమ్మ’ ముద్ర‌

By:  Tupaki Desk   |   14 Dec 2015 6:30 AM GMT
ఫ్లిప్‌కార్ట్ లో ‘అమ్మ’ ముద్ర‌
X
చెన్నై వ‌ర‌ద‌ల పుణ్య‌మా అని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మ‌రింత బాగా పాపుల‌ర్ అయిపోతున్నారు. చెన్నైలోని వరదబాధితుల సహాయార్థం అందించే ఆహార పొట్లాలు - ఇతర సహాయకాలపై జయలలిత స్టిక్కర్లు అతికించి మరీ పంపిణీ చేస్తూ తమ ‘అమ్మ’ భక్తిని అన్నాడీఎంకే కార్యకర్తలు నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. స్వచ్ఛందసంస్థలు అందించే సహాయకాలపై కూడా ‘అమ్మ’ స్టిక్కర్లు అతికించిన తర్వాతే వాటిని పంపిణీకి అనుమతించడం పలు విమర్శలకు తావిచ్చింది. అయితే ఈ ర‌చ్చ ముగిసింది అనుకునే స‌మ‌యంలోనే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది.

ప్ర‌ఖ్యాత ఆన్‌ లైన్ వెబ్‌ సైట్ ఫ్లిప్‌ కార్ట్‌ లో అమ్మ స్టిక్క‌ర్ల‌ను అమ్మకాలకు ఉంచినట్లు ప్రకటన వెలువ‌డింది. ఫ్లిప్‌ కార్ట్‌ లో ‘అమ్మ’ స్టిక్కర్లు విక్రయాలకు ఉంచినట్లు వాట్సాప్‌ - ఫేస్‌ బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ స‌మాచారం హల్‌ చల్‌ చేసింది. 500 స్టిక్కర్ల ధర రూ.899 కాగా 11శాతం రాయితీతో రూ.799కే అందిస్తున్నట్లు అందులో పొందుపరిచారు. జయలలితకు చెందిన అయిదు చిత్రాలను స్టిక్కర్ల నమూనాకు ఉంచారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించడంతో పలువురు ఫ్లిప్‌ కార్ట్‌ వెబ్‌ సైట్‌ ను సందర్శించారు.

అమ్మ అభిమానుల ఆప్యాయ‌త మ‌రీ అతి స్థాయికి చేరుతోంద‌ని చెన్నై తంబీలు చ‌ర్చించుకుంటున్నారు.