Begin typing your search above and press return to search.
‘పోయెస్’పై అమ్మ వీలునామా?
By: Tupaki Desk | 10 Feb 2017 4:15 AM GMTఅమ్మ జీవితంలో కష్టపడి సంపాదించిన మొత్తంతో కొన్న ఆస్తుల్లో పోయెస్ గార్డెన్ భవనం. సినిమా హీరోయిన్ గా పని చేసే సమయంలో.. తొలినాళ్లలో వచ్చిన సొమ్ముతో కట్టించుకున్న ఇల్లు అన్న సంగతి తెలిసిందే. అమ్మ మరణం తర్వాత.. అమ్మకు ప్రాణసమానమైన పోయెస్ గార్డెన్ ఎవరికి చెందుతుంది? దాని హక్కుదారు ఎవరు? అన్న ప్రశ్న తలెత్తించి. అయితే.. అమ్మ మరణం తర్వాత నెచ్చెలి శశికళ పోయెస్ గార్డెన్ లోనే ఉండిపోవటంతో ఎవరూ ఏమీ అనలేదు. నిజానికి అలా అనే అవకాశం.. సందర్భం కూడా రాలేదని చెప్పాలి.
పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో.. తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం పోయెస్ గార్డెన్ మీద సంచలన ప్రకటన చేశారు. అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్ ను ‘జయ స్మారకం’గా మార్చనున్నట్లుగా ప్రకటించారు. అంటే.. పోయెస్ లో ఉన్న చిన్నమ్మను బయటకు వెళ్లగొట్టటమన్న మాట.
ఈ మాట పన్నీర్ నోట వచ్చిన కొద్ది గంటలకే ఆన్ లైన్లో అమ్మ వీలునామా ప్రత్యక్షమైంది. జయ రాసిన వీలునామా అన్న పత్రంపై జయ సంతకంతో పోయెస్ గార్డెన్ ఎవరికి చెందుతుందో అమ్మ చెప్పినట్లుగాఈ పత్రంలో ఉండటం విశేషం. వీలునామా ప్రకారం.. పోయెస్ గార్డెన్ చిన్నమ్మ మరదలు ఇళవరసికి చెందేలా అమ్మ వీలునామా రాసినట్లుగా ఉందని తమిళ మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ వీలునామాపై జయ సంతకం కనిపించినా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన నామినేషన్ తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో.. పోయెస్ గార్డెన్ తన సొంతమన్న విషయాన్ని పేర్కొన్నారు. అధికారంలో వచ్చిన కొద్ది నెలలకే వీలునామా రాసేయటం.. పోయెస్ ను శశికళ మరదలకు చెందేలా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోయెస్ లోని వేదనిలయంపై ఆన్ లైన్లో వచ్చిన ఈ వీలునామా ఇప్పుడు పెద్ద చర్చనే రేపుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/