Begin typing your search above and press return to search.
అమ్మ పోటీ చేయాలంటూ ఎన్ని వినతులో..?
By: Tupaki Desk | 25 Jan 2016 3:54 AM GMT‘‘అమ్మ’’ మీద అన్నా డీఎంకే పార్టీ నేతల అభిమానం పొంగి పొర్లుతుంది. అమ్మ మనసును ఆకట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టని వైనం తెలిసిందే. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తెర లేవనున్న నేపథ్యంలో..ఏయే నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయంపై పార్టీకి దరఖాస్తు చేసుకునేలా నిర్ణయం ప్రకటించారు.
జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3 మధ్య కాలంలో అయా అసెంబ్లీ స్థానాల బరిలో దిగే ఔత్సాహికులు పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు రూ.11వేల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. పార్టీకి చెందిన పలువురు నేతలు.. తమ నియోజకవర్గాల్లో అమ్మ జయలలిత పోటీ చేయాలంటూ దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.
ఈ తరహాలో దరఖాస్తు చేసుకున్న నాయకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతంది. అమ్మ మీద ఈ తరహా ప్రేమను ప్రదర్శించటం ద్వారా ప్రయోజనం ఎంతన్నది సందేహమైనా.. అమ్మ మనసును దోచుకోవటానికి ఈ తరహా యత్నం ఎంతోకొంత లాభం చేకూరుతుందన్న భావనలో అన్నాడీఎంకే నేతలు ఉండటం విశేషం.