Begin typing your search above and press return to search.
ఢిల్లీని శాసించిన జయ సత్తా
By: Tupaki Desk | 6 Dec 2016 6:52 AM GMT1999లో ఒక్క ఓటుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు గద్దె దిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలా కేంద్ర ప్రభుత్వాన్ని దించేసిన చరిత్ర తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితదే. స్వతహాగా బీజేపీ అప్పటి నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అంటే జయకు అభిమానమే. అయితే ప్రస్తుత బీజేపీ నేత అయిన సుబ్రహ్మణ స్వామి అప్పట్లో జయ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన సలహా మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో కలిసి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. తద్వారా ఒక్క ఓటుతో కేంద్రాన్ని దింపేసిన ప్రత్యేకతను జయ చాటుకున్నారు.
ఇలా తమిళనాట మాత్రమే కాకుండా దేశ రాజకీయాల్లోనూ అందరికంటే భిన్నమైన నేతగా జయలలిత గుర్తింపు పొందారు. జయ ఏం చేసినా సంచలనమే, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమే. ఆమె అంతరంగం ఎవరికీ అంతుబట్టనిది. పూర్తిగా భిన్నమైన శైలి జయం సొంతం. 18 సంవత్సరాలకు పైగా దాదాపు 14 రకాల కేసులు మెడకు చుట్టుకుని పీకల్లోతు కష్టాల్లో చిక్కుకొన్నా, జైలుకెళ్లాల్సి వచ్చినా ఏమాత్రం తొణకని, బెణకని మనోనిబ్బరం ఆమెది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అష్ట కష్టాలు పడింది. ఈ కేసుల్లో ఆమె సీఎం పదవి పోయింది. జైలుకెళ్లాల్సి వచ్చింది. మానసికంగా ఆమెకు ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయంగా మాత్రం ఎప్పటికీ సంచాలనాత్మకంగానే కనిపించేవారు. అధికారంలో లేనపుడు రాజకీయంగా ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదరలేదు. పైగా అవకాశం దొరికినపడు ప్రత్యర్థులను తరిమి తరిమి కొట్టి వారి అంతు చూసేదాక వదిలేది కాదు.
కాగా అన్నాడీఏంకే అధినేత్రి జయలలిత దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఆశ్చర్యపరిచారు. తన వాక్చాతుర్యంతో ఇందిరను ఆకట్టుకున్నారు. జయ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. జయ వాగ్దాటికి ఎంజీఆర్ ఆమెను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నారు. 1981లో అన్నాడీఏంకేలో అడుగుపెట్టిన జయలలిత పార్టీ కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. తన వాక్చాతుర్యంతో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. 1984లో రాజ్యసభకు పంపారు. రాజ్యసభలో ఇంగ్లీష్ మాట్లాడి జయ ఇందిరాగాంధీని ఆశ్చర్యపరిచి ఆకట్టుకున్నారు.