Begin typing your search above and press return to search.
అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన అమ్మ
By: Tupaki Desk | 17 May 2016 9:57 AM GMTఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు తమిళనాడులో విజయావకాశాలు జయలలితకే ఉన్నాయని అంచనాలు వచ్చాయి. కానీ... ఎన్నికల పోలింగు తరువాత వివిధ సంస్థల సర్వేలు మత్రం కరుణానిధికి ఫేవర్ గా అంచనాలు వెల్లడించాయి. ఫలితం ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రానుందని వెల్లడించిన నేపథ్యంలో, ఆమె గత రాత్రి నుంచి ఎవరికీ దర్శనమివ్వలేదు. పోయిస్ గార్డెన్ లోని తన ఇంటికి వచ్చిన కొందరు మంత్రులనూ ఆమె నిరాకరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ఎల్లుండి విడుదకానుండగా, అప్పటివరకూ అమ్మ దర్శనం ఎవరికీ లభించబోదని సమాచారం.
కాగా, తమిళనాట డీఎంకే విజయం సాధించనుందని, గత మూడు దశాబ్దాల్లో ఏ పార్టీకీ వరుసగా రెండు సార్లు అధికార పీఠాన్ని ఇవ్వని తమిళనాడు ఓటర్లు మరోసారి అదే సంప్రదాయాన్ని పాటించనున్నారని ఎగ్జిట్ పోల్సు చెబుతున్నాయి. పోలింగు శాతం పెరగడం, ఇతరత్రా కారణాల వల్ల జయ కూడా ఓటమిని ఊహిస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఆమె ఎవరికీ కనిపించడం లేదని చెబుతున్నారు.
మరోవైపు ఎగ్జిట్ పోల్సు ఇచ్చిన ఊపుతో కరుణానిధి పార్టీలో సంబరాలు జరుగుతున్నాయి. 92 ఏళ్ల వయసులో మరోసారి ముఖ్యమంత్రి కావాలని కరుణ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే... కుమారుడు స్టాలిన్ కు ఆ అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. కరుణ మాత్రం ఇటీవల తానే సీఎం అవుతానని ప్రకటించారు. కాగా ఎన్నికలకు ముందు నుంచి గందరగోళంలో పడి.. పార్టీలో కుమ్ములాటలు పెరిగి దెబ్బతిన్న డీఎండీకే నేత విజయ్ కాంత్ ఈ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీకి ఒక్కసీటు కూడా రాదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. తాజా అంచనాల నేపథ్యంలో అమ్మ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడంతో ఏఐడీఎంకే శ్రేణులు నీరసించిపోయాయట. వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని అందుకుని రికార్డు సృష్ఠించాలన్న ఆశలు నెరవేరుతాయా లేదా అని తెగ టెన్షన్ పడుతున్నారు వారంతా.