Begin typing your search above and press return to search.

అత్యంత క్లిష్టంగా జయలలిత ఆరోగ్యం

By:  Tupaki Desk   |   5 Dec 2016 9:56 AM GMT
అత్యంత క్లిష్టంగా జయలలిత ఆరోగ్యం
X
తమిళనాడు సీఎం జయలలిత ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమని చెన్నై అపోలో వైద్యులు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. అందులో వివరాలు చూస్తే పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. కేవ‌లం ఐదు లైన్ల హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేసినప్పటికీ అందులో వివరాలు మాత్రం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరి రోదిస్తున్నారు.
బులిటెన్ లోని విషయాలు ఇవీ..

- నిన్న సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కు గురైన జ‌య‌ల‌లిత ఆరోగ్యం ఇప్పుడు మ‌రింత దిగ‌జారింది.

- ఈసీఎంవో, లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టమ్స్‌ ద్వారా జయలలితకు చికిత్స అందిస్తున్నారు.

- గుండె, ఊపిరితిత్తుల పనిని ఏకకాలంలో నిర్వహించే అత్యంత అధునాతమైన వైద్య పరికరం ఈసీఎంవో ద్వారా ఈ చికిత్స కొనసాగుతోంది.

కాగా సుబ్బ‌య్య విశ్వ‌నాథం అనే అపోలో వైద్యుడి పేరిట ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. తాజా బులిటెన్ విడుద‌ల‌తో ఆసుప‌త్రి వ‌ద్ద ఆమె అభిమానులు మరింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరోవైపు లండ‌న్ వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బెల్లే కూడా కొద్ది సేప‌టి క్రితం అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ఆయ‌న పరీక్షిస్తున్నారు. మ‌రోవైపు ఆసుప‌త్రి వైద్య నిపుణుల బృందం జ‌య‌ల‌లిత ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తోందని వైద్యులు తెలిపారు.

అపోలోకు వచ్చేసిన డాక్టర్ రిచర్డ్ బెల్లే

అమ్మ ఆరోగ్యంపై నెలకొన్న గందరగోళం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. అమ్మ కార్డిక్ అరెస్ట్ కు గురయ్యారని అపోలో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ స్పష్టం చేస్తే.. ఈ రోజు ఉదయం ఆమెకు ఆపరేషన్ జరిగినట్లుగా అన్నాడీఎంకే పార్టీ మహిళా నేత సరస్వతి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం అపోలో విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ లో అమ్మ ఆరోగ్యం మరింత విషమంగా ఉందంటూ వెల్లడించింది.

అదే సమయంలో..ఆమెకుఈ రోజు ఉదయం ఆపరేషన్ జరిగిన విషయాన్నిఅపోలో కన్ఫర్మ్ చేయలేదు. దీంతో.. ఆమెకుసాగుతున్న చికిత్స ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి. ఓపక్క కేంద్రం ఎయిమ్స్ వైద్యుల్ని పంపింది. ఇదిలా ఉంటే.. అమ్మ అనారోగ్యానికి గురైనప్పటి నుంచి లండన్ కు చెందిన వైద్య నిపుణులు రిచర్డ్ బెల్లే వైద్యం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆమెకు వైద్యం చేసి.. ఆమె పరిస్థితి మెరుగైన నేపథ్యంలో లండన్ వెళ్లిపోయిన ఆయన్ను.. ఆ మధ్యలో ఒకసారి హుటాహుటిన పిలిపించారు. తాజా ఎపిసోడ్ లోనూ ఆయన అవసరాన్ని గుర్తించిన అపోలో వైద్యులు.. అమ్మ తాజా పరిస్థితిపై సమాచారం అందించారు. దీంతో.. ఆయన హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. డాక్టర్ రిచర్డ్ బెల్లే అపోలో ఆసుపత్రికి చేరుకొని..అమ్మ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా చెబుతున్నారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన తదుపరి హెల్త్ బులెటిన్ ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/