తమిళనాడు సీఎం జయలలిత గత 38 రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయ చుట్టూ రోజుకొక స్టోరీ బయటకు వస్తోంది. నిన్న గాక మొన్న నీళ్లు తాగారని, యాపిల్ తిన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా అమ్మ వేలిముద్ర వేశారని కూడా ఓ వార్త సహా ఆమె వేసిన వేలి ముద్ర తాలూకు పత్రం కూడా మీడియాకు లీక్ అయ్యింది. వాస్తవానికి ఎప్పుడూ జయ వేలి ముద్ర వేయలేదు. ఎప్పుడు ఏ అవసరానికి సంతకం చేయాల్సి వచ్చినా కూడా చక్కటి దస్తూరితో తన సంతకాన్ని ఇంగ్లిష్ లోనే ఆమె చేసేది. కానీ, ఈ తరహాలో జయ వేలిముద్ర వేసిన ఘటనలు అసలు లేవు.
ఈ నేపథ్యంలో జయ సంతకం చేయాల్సిన చోట వేలిముద్రలు వేయడంపై సర్వ్రతా ఆసక్తి రేగింది. నిజానికి అపోలో ఆస్పత్రి వైద్యులు ఇటీవల ప్రకటించిన న్యూస్ ను బట్టి... జయ దీపావళి పండుగకు ఆస్పత్రి నుంచి వచ్చేస్తారని అప్పటికి ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని వార్తలు వచ్చాయి, దీంతో అన్నాడీఎంకే సహా అందిరూ సంబరాలు చేసుకున్నారు. జయ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. ఇంతలో జయ వేలి ముద్ర ఘటన బయటపడేసరికి వీరి ఆశలు గల్లంతవుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అయితే, రెండు నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారనే ఫిర్యాదు రావడంతో అవరకురిచ్చి - తంజావూరులు సహా ఎమ్మెల్యే మృతి చెందడంతో తిరుప్పనకుండ్రంలో బై పోల్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను పార్టీ ఎంపిక చేసింది. పార్టీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేశారు. అయితే, పార్టీ ఇచ్చిన బీ ఫారంను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఆయా అభ్యర్థుల బీ ఫారాలపై ఎన్నాడీఎంకే చీఫ్ జయ సంతకం చేయాల్సి వచ్చింది.
ఈ పత్రాలను ఆస్పత్రికి పంపించగా.. కేవలం ఆమె ఆస్పత్రి బెడ్ మీద నుంచే బీ ఫారాలపై సంతకానికి బదులు ఎడమ చేతి బొటన వలితో మద్ర వేసిందట. దీనిని బలపరుస్తూ.. ఆస్పత్రి వైద్యులు కూడా సంతకాలు చేశారు. అయితే, జయ ఆరోగ్యం బాగుందని చెబుతున్న క్రమంలో అసలు వేలిముద్ర వేయాల్సిన అవసరం ఏంటనేది తాజా ప్రశ్న. దీనికి ఆస్పత్రి వైద్యులు ఏమంటున్నారంటే.. ట్రెకియోటెమి విధానంలో జయలలిత కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, అందుకే ఎడమచేతి వేలిముద్ర వేశారని వివరణ ఇచ్చారట.
ట్రెకియోటెమి విధానంలో జయలలిత కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, అందుకే ఎడమచేతి వేలిముద్ర తీసుకున్నామని వివరించారట. సో.. ఇదీ జయ తాజా ఆరోగ్య పరిస్థితి. అయితే కీలకమైన బీ ఫారం పత్రాలపై జయ వేలిముద్రలు వేయడంతో జయ ఆరోగ్యంపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/