Begin typing your search above and press return to search.
అమ్మపై వీరిది అభిమానం కాదు.. అంతకుమించి!
By: Tupaki Desk | 3 Oct 2016 9:25 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పాలై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే రకరకాల గాసిప్పులు వినిపించడం - కరుణానిధి సైతం ఆమె ఆరోగ్యంపై ప్రస్తుత పరిస్థితి చెప్పాలని, ఫోటోలు విడుదల చేయాలని కోరారు. ఇదే సమయంలో తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో జయలలిత ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారని తెలిపారు అపోలో వైద్యులు. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అమ్మ అభిమానులు ఆందోళన చెందుతుండగా, వారిలో ముగ్గురు ఫ్యాన్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జయలలితను ఆస్పత్రిలో చేర్చినప్పటినుంచీ ఈ ముగ్గురూ ఆసుపత్రి ఎదుటే ఉంటున్నారు. అమ్మకు తొందరగా నయం కావాలని దేవుడిని పూజిస్తున్నారు.
అమ్మ అభిమానుల్లో - చెన్నై ఆస్పత్రి వద్ద ఉంటున్న ఆమె అభిమానుల్లో ఒకరు మొదురమ్ పొన్నుస్వామి. ఈయన చేతికి రెండు పెద్ద పెద్ద ఉంగరాలు ఉన్నాయి. వాటిలో ఒక ఉంగరంలో జయలలిత ఫోటో ఉండగా, మరో ఉంగరంలో ఎంజీఆర్ ఫోటో ఉంది. ఈయన అమ్మ వీరాభిమాని అని చెప్పుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అలాగే మెడలోని గొలుసులో కూడా అమ్మ ఫోటో - ఫోన్ రింగ్ టోన్ లో ఎంజీఆర్ పాట ఉన్నాయి. ఈ స్థాయిలో అమ్మ అంటే పొన్నుస్వామికి ఇష్టం - అభిమానం. గతంలో ఎంజీఆర్ కు జబ్బు చేసినప్పుడు తాను పాదయాత్ర చేసి... గుడి - మసీదు - చర్చి అనే భేదాలు లేకుండా అందరి దేవుళ్లను దర్శించుకున్ననని, ఆ తర్వాత ఎంజీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చి మళ్లీ పాలించాడని, అలాగే అమ్మకూడా తిరివస్తుందనే నమ్మకం తనకు ఉందని చెబుతున్నాడు.
ఇదే క్రమంలో జే మరిముత్తు అనే అభిమాని అయితే..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన దేవత అని, అమ్మను తాను నిత్యం పూజిస్తుంటాడని చెబుతున్నాడు. సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటిపేరును తనయులు తన ముందుపేరుగా పెట్టుకుంటారు... కానీ మరిముత్తు మాత్రం జయలలిత పేరులో మొదటి అక్షరం 'జే'ను తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.
ఇక అమ్మ అనారోగ్యంపై కంగారు పడుతున్న వారిలో వెంకటేశన్ కూడా ఒకరు. ఈయన పేరు వెంకటేశనే అయినా ఆ పేరు ముందు ఎంజీఆర్ అనే పదాన్ని చేర్చుకుని ఎంజీఆర్ వెంకటేశన్ అయిన ఇతడు, అమ్మకు కలలో కూడా ఏం కాదని చెబుతూ, కనిపిస్తూ మాట్లాడే దేవత అని చెబుతున్నాడు. ఆమె ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నా, ఎన్ని రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినా అప్పటివరకూ అక్కడే తాము వేచి చూస్తామని చెబుతున్నాడట.
ఇలా ఒకరిని మించి ఒకరు అమ్మకు అభిమానులు, భక్తులు ఉన్నారని మచ్చుకు వీరిని కదిపితే తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రస్తుతం తమిళనాడుకు ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన కావేరీ జల వివాదంపై కూడా అమ్మ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అమ్మ మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం చూపించగలదని నమ్ముతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/