Begin typing your search above and press return to search.
సంచలనం: అమ్మ గురించి షాకింగ్ న్యూస్
By: Tupaki Desk | 28 Sep 2017 5:00 PM GMTఅవును! ఇప్పుడు తమిళనాడులో ఈ వార్త సంచలనంగా మారింది. దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి - పురుచ్చితలైవిగా పూజలు అందుకున్న జయలలిత గురించి ఇప్పుడు ఓ కీలక వార్త బయటకు లీకైంది. దీంతో ఇది తీవ్ర కలకలం రేపింది. విషయంలోకి వెళ్తే.. గత ఏడాది సెప్టెంబరు తొలి వారంలో తీవ్ర అనారోగ్యంతో సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరారు. దాదాపు రెండు నెలల పాటు ఆమెకు వైద్యం అందించారు. అయితే, ఆమెకు అందించిన చికిత్స, చేసిన ఆపరేషన్ వంటి వాటిపై ఇప్పటికీ మిస్టరీ వీడలేదు.
ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పలుమార్లు ఆస్పత్రి వర్గాలు బులెటిన్లు విడుదల చేయడమే తప్ప మౌఖికంగా కానీ, వీడియో రూపంలో కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇక, ఆమె మృతి తర్వాత అనేక అనుమానాలు రేకెత్తాయి. అమ్మను చూశామని మంత్రులు ఇటీవల కొందరు చెప్పగా, చూడలేదని మరికొందరు చెప్పారు. అత్త ఇడ్లీ తిన్నదని అల్లుడు దీపక్ - బత్తాయి జ్యూస్ తాగిందని ఆమె మేనకోడలు దీప వెల్లడించింది. ఇలా పొంతనలేని సమాధానాలు జయ మరణాన్ని మరింత మిస్టరీ చేశాయి. దీంతో ప్రభుత్వం తాజాగా మద్రాస్ హైక్టోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్ముగంతో ఓ ఏకసభ్య కమిషన్ ను నియమించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు లేటెస్ట్ గా అమ్మ మృతిపై ఓ వార్త లీకైంది. జయలలితను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అసలు ఆమె శ్వాస లేకుండా ఉన్నారని, పూర్తి మగతలో ఉన్నారని ఆమె తొలి మెడికల్ నివేదిక ద్వారా తెలిసింది. 2016 సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన రోజు ఆమె తీవ్ర ఇన్ ఫెక్షన్ తోపాటు డీహైడ్రేషన్ సమస్యతో ఉన్నారని, శ్వాస సంబంధమైన ఒత్తిడితో ఉన్నారని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఆ సమయంలో ఆమె షుగర్ లెవల్స్ 508 ఉందని, ఆక్సిజన్ లెవల్ 45శాతం ఉందని పేర్కొంది. పోయేస్ గార్డెన్ లో ఆమెను ఎవరైనా కిందికి తోశారేమోనని అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఆమెకు అసలు ఎలాంటి గాయాలు లేవని కూడా రిపోర్టులో వివరించారు. ఇప్పుడు ఈ విషయం తమిళనాట కలకలం సృష్టించింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు వస్తాయో చూడాలి.