Begin typing your search above and press return to search.

35 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్న అమ్మ?

By:  Tupaki Desk   |   3 April 2016 9:36 AM GMT
35 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్న అమ్మ?
X
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పాలకపక్షం ప్రతిపక్షంగా.. ప్రధాన ప్రతిపక్షం పాలక పక్షంగా మారిపోతుంటుంది. గత35 ఏళ్లుగా ఇదే పద్ధతి నడుస్తోంది. ఒకసారి పవర్ కు అవకాశం ఇచ్చే తమిళులు.. మరోసారి విపక్షంలో కూర్చోపెట్టటం అలవాటు. ఇలాంటి పరిస్థితి ఏళ్లకు ఏళ్లుగా సాగుతోంది. ఈ రికార్డును అమ్మ ఈసారి బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు.

1989 నుంచి తమిళనాడులోని ఏ అధికారపక్షం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది లేదు. కానీ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దీనికి భిన్నమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే.. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు.. ఎంఎంకే.. పుదియ తమిళగం.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసిన జయ నేతృత్వంలోని అన్నాడీఎంకే.. తాను అధికారంలోకి వచ్చిననాటి నుంచి సంక్షేమ పథకాల మీద విపరీతంగా దృష్టి పెట్టారు.

అమ్మ పేరిట స్టార్ట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న జయలలిత సర్కారుపై కొద్దిపాటి విమర్శలు ఉన్నా.. అవేవీ తాజా ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాల్ని దెబ్బ తీయలేవని చెబుతున్నారు. అమ్మ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో తమిళనాడు రాజకీయాల్లో ఉన్న 35 ఏళ్ల రికార్డును అమ్మ ఈసారి బద్ధలు కొట్టి.. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.