Begin typing your search above and press return to search.

అమ్మ 100 రోజుల సంబురం అదిరిపోలేదా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 9:36 AM GMT
అమ్మ 100 రోజుల సంబురం అదిరిపోలేదా?
X
తమిళనాడులో మరో ఎన్నికల హామీని ముఖ్యమంత్రి జయలలిత నెరవేర్చారు. ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రసూతి సెలవును 9 నెలలకు పెంచుతున్నట్టు అమ్మ‌ ప్రకటించారు. గతంలో ఆరు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని 9 నెలలకు అమ్మ ప్రభుత్వం పెంచింది. '2011లో మా ప్రభుత్వం మెటర్నిటీ లీవును 90 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇప్పుడు దాన్ని 9 నెలలకు పెంచుతున్నాం' అని ఏఐఏడీఎంకే శాసన సభ్యుల హర్షాతిరేకాల మధ్య జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్టు ఆమె తెలిపారు. మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కీల్‌పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో, కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో వాస్క్యులర్ - కార్డియో - ప్లాస్టిక్ సర్జరీ - కిడ్నీ ఆపరేషన్లు జరిగేలా మౌలిక వసతులను కల్పించనున్నట్టు ప్రకటించారు.

తమిళనాడులో జయలలిత రెండో దఫా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా అన్నా డీఎంకే పార్టీ శాసనసభ్యులు ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. పోటీలు పడి మరీ జయలలితపై ప్రశంసల జల్లు కురిపించారు. అమె వంటి నేత ప్రపంచంలో మరెవరూ లేరని కొనియాడారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ఆనందంగా బల్లలు చరుస్తుంటే, స్పీకర్ ధనపాల్ పావుగంట సేపు జయలలితను పొగడుతూ చేసిన ప్రకటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అశోక చక్రవర్తి సహా ఏ రాజు కూడా అమ్మలా ప్రజలను పాలించలేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ధనపాల్ మాట్లాడుతూ, 'అశోకుడు జనరంజకంగా పాలించాడంటారు. నేను పోల్చి చూస్తూ అధ్యయనం చేశాను. అమ్మ పాలన అశోకుడి ఘనతను మించింది.సువిశాల సామ్రాజ్యం ఉన్నప్పటికీ, నాటి అశోకుడి పాలన నేటి అమ్మ పాలన కంటే గొప్పదేమీ కాదు. అన్ని రంగాల్లో అశోకుని మించింది అమ్మ పాలనే మిన్న. గుప్తుల కాలం స్వర్ణయుగమని చరిత్ర చెబుతోంది. ఇకపై చరిత్రకారులు అమ్మ పాలనకు మించిన పాలన లేదని చెబు తారు. అమ్మదే నిజమైన స్వర్ణయుగమని చరిత్రకారులు రాయనున్నారు' అంటూ తన భక్తిని చాటుకున్నారు. ఇక తమిళనాడులో 100 రోజుల ఉత్సవా ల సందర్భంగా సచివాలయం, అసెంబ్లీ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలు - పూల తోరణాలతో అలంకరించారు. ఈ ప్రాంతాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోయాయి.