Begin typing your search above and press return to search.

జగన్ డేరింగ్ నిర్ణయాలపై స్పందించిన జేపీ

By:  Tupaki Desk   |   10 Sep 2020 6:30 AM GMT
జగన్ డేరింగ్ నిర్ణయాలపై స్పందించిన జేపీ
X
లోక్ సత్తా పార్టీ వ్యవస్తాపకుడిగా.. ప్రముఖ మేధావిగా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ సమాజాన్ని ఆవపోసన పడుతుంటారు. ఎవరు తప్పు చేస్తున్నారు. ఎవరు కరెక్ట్ చేస్తున్నారన్నది కుండబద్దలు కొడుతుంటారు. తాజాగా ఓ చానెల్లో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని సమస్యలపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆయన బహిరంగంగా ప్రశంసించారు.

ప్రభుత్వ నిర్ణయాలలో కోర్టుల ప్రమేయం గురించి మాట్లాడుతూ, "కోర్టులు తమ కర్తవ్యాన్ని చేయాలి. ప్రభుత్వాలు తమ పాలన విధులను నిర్వర్తించాలి. అయితే ఈ రోజుల్లో అవి డైవర్ట్ అవుతున్నాయని జేపీ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఖండించడం సరైందే. కానీ ప్రభుత్వ విధాన విషయాలలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని పౌరులు కూడా అభిప్రాయపడుతున్నారన్నారు.

ప్రభుత్వం అనేది మెజారిటీ ప్రజలతో ఎన్నుకోబడుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ దాని నిర్ణయాలకు ఆటంకం కలిగించకూడదని... రాజధాని ఎక్కడ ఉందో అది పట్టింపు కాదు. ఇది జరగవలసిన వికేంద్రీకరణ అని జగన్ రాజధాని మార్పు నిర్ణయానికి జేపీ జై కొట్టారు.

విద్యుత్ మీటర్ల గురించి మాట్లాడుతూ, "ఇప్పుడు ఏదో మంచి జరుగుతోందనేది నా అభిప్రాయం. వైయస్ఆర్ తో కూడా ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఆ రోజుల్లో నేను వాదించానని.. కానీ అది సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని గుర్తించాలని జేపీ వాదించారు.

విద్యుత్తు ఎంత వినియోగించబడుతుందో.. వాస్తవానికి ఎక్కడ ఉపయోగించబడుతుందో తెలుసుకోవడానికి మీటర్ల ఫిక్సింగ్‌పై నేను నొక్కి చెప్పానని జేపీ అన్నారు. వనరుల వాంఛనీయ వినియోగం కోసం కరెంట్ ఆడిట్ చేయాలని నేను సూచించాను. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు నేను అభినందిస్తున్నానని జేపీ అన్నారు.