Begin typing your search above and press return to search.

అన్నీ ఫ్రీ అయితే బాగుపడడం కష్టమే: జేపీ

By:  Tupaki Desk   |   24 Feb 2019 8:23 AM GMT
అన్నీ ఫ్రీ అయితే బాగుపడడం కష్టమే: జేపీ
X
జయప్రకాష్‌ నారాయణ. మాజీ ఐఏఎస్‌ అధికారిగా - లోక్‌ సత్తా అధ్యక్షుడిగా అందరికి పరిచయం. ఏదైనా కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే జేపీ.. ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు ఏమాత్రం పనికిరాదు. అందుకే ఆయన కూడా రాజకీయాలంగా దూరంగా ఉండిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా సమకాలీన అంశాలపై ఆయన ఎప్పుడూ తన గళాన్ని విన్పిస్తూనే ఉంటారు. ప్రజలుకు ఏది మంచిందో ఎప్పుడూ సూచిస్తూనే ఉంటారు. ఆదీగాక.. జేపీ ప్రసంగాలు కూడా యువతను ఆకర్షిస్తాయి. ఒక అంశం గురించి లోతుగా అధ్యయనం చేసి అందులో ఉన్న లోటు పాట్లని వివరించడంలో జేపీకి సాటి మరెవ్వరూ లేరు. అలాంటి జేపీ.. ఉచిత పథకాలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఉచిత పథకాల ద్వారా ప్రజలు సోమరిపోతులుగా తయారవుతారని విమర్శించారు.

శనివారం విజయవాడలో లోక్‌ సత్తా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2019 ఎన్నికలు - ప్రజల మేనిఫెస్టోని విడుదల చేశారు జేపీ. దేశంలో 2019 తర్వాత పెనుమార్పు రాబోతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వికేంద్రీకరణ ఒక్కటే శరణ్యమని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో ఏ రాజకీయ పార్టీ అయినా ముందు ఉండకపోతే.. ఇక ఆ రాజకీయ పార్టీ ఎందుకుని ప్రశ్నించారు. ప్రజలకు ఏం కావాలో అవి ఇవ్వాలని.. అవన్నీ పక్కనపెట్టి ఉచితం అంటూ ఇస్తూ పోతే.. వారి జీవితాలు బాగుపడవని అభిప్రాయపడ్డారు జయప్రకాష్‌ నారాయణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని - ఓట్ల కోసం వేలం పాటలు పాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సీటుకు రూ.25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కూడా అభ్యర్థులు వెనకాడడం లేదని, అదంతా గెలిచాక వసూలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆరోపించారు జేపీ.