Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. జయప్రద చిందులు

By:  Tupaki Desk   |   8 Nov 2015 6:39 AM GMT


డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు ఎందుకు చేస్తారు..? డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికే కదా. టెస్టు చేయకుండా ఓ వ్యక్తి మందు కొట్టలేదని ఎలా తెలుస్తుంది? ఒక్క నిమిషం బ్రీత్ అనలైజర్ లో ఊదేసి వెళ్లిపోతే ఏమవుతుంది? టెస్టు కోసం ఆపినందుకు పోలీసుల మీద చిందులెయ్యాలా? ఆ గొడవను కెమెరాల్లో బంధిస్తున్న మీడియా వాళ్లను తిట్టిపోయాలా? ఎంపీగా కూడా ​​పని చేసిన జయప్రద ప్రవర్తించిన తీరిది. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డులో జయప్రద కారును ఆపినందుకు ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఆ సమయంలో జయప్రద డ్రైవర్ సీట్ లో లేరు. ఆమె డ్రైవరే కారు నడుపుతున్నాడు. అతను కూడా మద్యం తాగలేదని తర్వాత టెస్టులో తేలింది. ఐతే తన కారును ఆపి డ్రైవర్ ను టెస్ట్ చేయబోయినందుకు జయప్రదకు కోపం వచ్చేసింది. ఈ గొడవను చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ల మీద కూడా జయప్రద ఫైర్ అయిపోయారు. చివరికి డ్రైవర్ కి టెస్టు చేసి, జయప్రదకు సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు పోలీసులు.