Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ను ప్రధాని చేసిందే అతడట..గుణపాఠం నేర్పుతాడట!

By:  Tupaki Desk   |   13 Aug 2020 6:00 AM GMT
ఇమ్రాన్ ను ప్రధాని చేసిందే అతడట..గుణపాఠం నేర్పుతాడట!
X
జెంటిమెన్ గేమ్ గా అభివర్ణించే క్రికెట్ క్రీడలో తన తీరుతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పాక్ వెటర్నర్ క్రికెటర్ జావెద్ మియాందాద్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ను ప్రధానిగా చేసిందే తానని చెప్పారు. తన సలహాలతోనే పాక్ ప్రధాని పదవిని చేపట్టారని.. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తే కానీ దేశంలోని సమస్యలకు.. క్రికెట్ లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

తాను రాజకీయాల్లోకి వచ్చి ఇమ్రాన్ కు గుణపాఠం నేర్పుతానని చెబుతున్నారు. తన సలహాలు.. సూచనలతో దేశానికి ప్రధాని అయిన.. ఇమ్రాన్ దేశానికి ద్రోహం చేశాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి రానున్నట్లు చెప్పారు. తాను చెప్పే మాటలు అబద్ధమైతే తన మాటల్ని ఇమ్రాన్ ఖండించాలని సవాలు విసిరారు. తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు.

ఇమ్రాన్ కారణంగానే పాకిస్థాన్ ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని.. క్రికెట్ సమస్యలకు ఆయనే కారణమన్నారు. ఇమ్రాన్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారని.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రికెట్ గురించి ఏమీ తెలీని విదేశాయుల్ని చేర్పించారన్న ఆయన.. ఒకప్పటి తన కెప్టెన్ మీద ఆయన తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేశారు. సహజంగానే దూకుడుగా వ్యవహరించే మియాందాద్.. రాజకీయాల్లోకి వస్తే.. మరెన్నో మార్పులు.. వివాదాలు.. సంచలనాలకు తెర లేవటం ఖాయమని చెప్పక తప్పదు.