Begin typing your search above and press return to search.

14న జ‌స్ప్రీత్‌ పెళ్లి.. బూమ్రాను బౌల్డ్ చేసింది ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   9 March 2021 6:30 AM GMT
14న జ‌స్ప్రీత్‌ పెళ్లి.. బూమ్రాను బౌల్డ్ చేసింది ఎవ‌రో తెలుసా?
X
టీమిండియా స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. ఇందుకోసం స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నెల 14న ఈ పేస‌ర్ వివాహం జ‌ర‌గ‌నుంది. దీంతో.. అమ్మాయి ఎవ‌రు అంటూ ఆన్ లైన్లో వెత‌క‌డం మొద‌లు పెట్టారు. ఇంత‌కీ ఆ వధువు ఎవ‌రంటే.. పేరు సంజ‌నా గ‌ణేష‌న్‌. ఈమె ఎవ‌రు? ఏం చేస్తుంటుంది? అనే వివ‌రాల‌ను ఈ స్టోరీలో చూద్దాం.

సంజ‌నా గ‌ణేష‌న్ ఓ స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్టు. మ‌హారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజ‌నా ఇంజ‌నీరింగ్ చ‌దివింది. ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్‌-7 ద్వారా త‌న కెరీర్ మొద‌లు పెట్టింది. ఐపీఎల్ తోపాటు ప‌లు స్పోర్ట్స్ ఈవెంట్ల‌కు ప్ర‌జెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలోనే బుమ్రాతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారింది, పెళ్లికి కూడా దారితీసింది.

ఇంతేకాదు.. ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. దీనికి కార‌ణాలు చాలా ఉన్నాయి. 2012లో ఫెమినా స్టైలిష్ దివాలో ఫైన‌లిస్టుగా నిలిచారు. అంతేకాదు.. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పుణె కిరీటం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత 2014లో ఓ డేటింగ్ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇన్ స్టాలో ఈ అమ్మ‌డికి దాదాపు 1.43 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

వీరి పెళ్లి గోవాలో జ‌రిపేందుకు నిశ్చ‌యించారు. అత్యంత స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఈ పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. పెళ్లి త‌ర్వాత రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్ గా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి సంజ‌నా చేతిలో క్లీన్ బౌల్డ్ అయిపోయిన బుమ్రా.. ఓ ఇంటివాడు అయిపోతున్నాడ‌న్న‌మాట‌.