Begin typing your search above and press return to search.

ఔట్‌ ఇవ్వడంతో అంపైర్‌ పైకి దూసుకెళ్లిన బ్యాట్స్‌ మన్‌

By:  Tupaki Desk   |   12 July 2019 5:09 AM GMT
ఔట్‌ ఇవ్వడంతో అంపైర్‌ పైకి దూసుకెళ్లిన బ్యాట్స్‌ మన్‌
X
క్రికెట్‌ లో ఆటగాళ్లు ఆట సరిగా ఆడటంతో పాటు క్రమశిక్షణతో కూడా ఉండాలనేది ఐసీసీ నిబంధన. ముఖ్యంగా అంపైర్ల నిర్ణయంను తప్పుబట్టడం.. అంపైర్లను దూషించడం వంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. గ్రౌండ్‌ లో ఐసీసీ నిబంధనలు అతిక్రమించిన ప్లేయర్స్‌ కు పలు సార్లు ఫైన్స్‌ విధించడం మ్యాచ్‌ నిషేదం వంటి శిక్షలు పడ్డ విషయం తెల్సిందే. అయినా కూడా కొన్ని సార్లు తాము చేయని తప్పుకు బలైపోతున్నామన్న బాధతో అంపైర్లపైకి దూసుకు పోవడం వారిని దూషించడం చేస్తూనే ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్‌ లో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సందర్బంగా బ్యాట్స్‌ మన్‌ రాయ్‌ అంపైర్‌ పట్ల చాలా దురుసుగా వ్యవహరించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌ మన్‌ రాయ్‌ క్రీజ్‌ లో ఉండగా కమ్మిన్స్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. కమ్మిన్స్‌ వేసిన బాల్‌ ను రాయ్‌ బలంగా హుక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కాని అది నేరుగా వెళ్లి కీపర్‌ చేతిలో పడింది. ఆసీస్‌ ఆటగాళ్లు అంతా కూడా అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ధర్మసేన కాస్త అనుమానంగానే ఔట్‌ ఇచ్చాడు. దాంతో రాయ్‌ అసలు తన బ్యాట్‌ కు బాల్‌ తలుగలేదు అంటూ ఆగ్రహంతో అంపైర్‌ మీదకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే రివ్యూ కోల్పోయిన ఇంగ్లాండ్‌ కు రివ్యూ తీసుకునే అవకాశం లేదు. దాంతో అసహనంతో రాయ్‌ తిట్లదండకం అందుకున్నాడు.

ధర్మసేన వద్దకు వెళ్లి రాయ్‌ వాదనకు దిగిన సమయంలో మరో అంపైర్‌ అతడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా అతడు ఆగలేదు. స్టేడియంలోని బిగ్‌ స్క్రీన్‌ లో రాయ్‌ ఔట్‌ కాదన్నట్లుగా కనిపించడంతో అతడి ఆగ్రహం మరింతగా పెరిగింది. డ్రస్సింగ్‌ రూంకు వెళ్లే వరకు అంపైర్‌ ను తిడుతూనే ఉన్నాడు. మ్యాచ్‌ గెలిచే పరిస్థితుల్లో ఉన్నా కూడా అతడి కోపంతో రగిలి పోయాడు. అప్పటికే 65 బాల్స్‌ ఆడిన రాయ్‌ 85 పరుగులు చేశాడు. 5 సిక్స్‌ లు 9 ఫోర్లతో చెలరేగి పోయాడు. సెంచరీ కొట్టడం ఖాయం అనుకుంటుండగా ఇలా అంపైర్‌ నిర్ణయంతో వెనుదిరిగాడు. అంపైర్‌ నిర్ణయం పట్ల ఆ సమయంలో ఎవరైనా అలాగే రియాక్ట్‌ అవుతారంటూ కొందరు రాయ్‌ కి మద్దతు తెలుపుతున్నారు. అయితే రాయ్‌ తీరుపై ఐసీసీ సీరియస్‌ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడికి మ్యాచ్‌ ఫీజులో కోత ఉండే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.