Begin typing your search above and press return to search.
పిల్లలే టార్గెట్.. పెదాలను చీల్చి చంపేస్తోన్న అందగత్తె
By: Tupaki Desk | 15 May 2020 7:00 AM GMTమాస్క్ పెట్టుకున్న ఓ రక్తపిశాచిగా మారిన మహిళ పెదాలను చీల్చి చంపేస్తోంది. ముఖ్యంగా పిల్లలను, టీనేజర్లనే టార్గెట్ చేసి క్రూరంగా వారి పెదాలను చీల్చేసి వదిలేస్తోంది. వారు రక్తస్రావం జరిగి చనిపోతున్నారు. ఓ సైకోగా మారిన మహిళ ఇలా హత్యలు చేయడం మొదలుపెట్టింది.
అది 1978.. జపాన్ దేశంలోని యోత్సు పట్టణం.. ఓ బాలుడిని.. ఓ చిన్నారిని ఇలాగే ఆ మాస్క్ లేడి చంపేసింది. పెదాలను చెవుల వరకు కత్తెరతో చీల్చి కడతేర్చింది. దీంతో ప్రజలు చీకటి పడితే బయటకు వెళ్లడమే మానేశారు. స్కూళ్లకు విద్యార్థులను పంపడం మానేశారు.
ప్రజల భయాందోళన నేపథ్యంలో పోలీసులు పరిశోధన మెదలుపెట్టారు. కానీ ఒక్క క్లూ దొరకలేదు. అయితే ఓ స్నేహితుడితో కలిసి ట్యూషన్ వెళ్లిన విద్యార్థిని కూడా ఇలానే చంపింది. కానీ అప్పుడు విద్యార్థి ఫ్రెండ్ ఆ క్రూర మహిళను చూశాడు. ఆమె మాస్క్ తో ఉన్నప్పుడు అందంగా ఉందని.. కానీ మాస్క్ తీసిన తర్వాత ఆమె భయంకరంగా ఉందని పోలీసులకు చెప్పాడు. ఆమె పెదవులు చెవి వరకు కోసి ఉన్నాయని.. నోట్లోని దంతాలు బయటకు కనిపించి భయంకరంగా ఉందని.. ఒక దెయ్యంలా ఉందన్నారు. మాస్క్ తో అందంగా ఉండే ఆమె మాస్క్ తీస్తే పెదాల వరకు చర్మం కోసేసి ఉండడం చూసి భయపడ్డానని విద్యార్థి తెలిపాడు.
దీంతో ఈ ఘటనను జపాన్ ప్రభుత్వం సవాల్ గా తీసుకుంది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు భద్రతను పెంచింది. కొందరు అనుమానాస్పద మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఆమె నుంచి తప్పించుకున్న కొందరు కీలక విషయం చెప్పారు. ‘నేను అందంగా ఉన్నానా’ అని ఆమె తొలుత ప్రశ్నిస్తుందట.. ‘ఔను’ అంటే మాస్క్ తీసి అసలు రూపం చూపిస్తుందట..అప్పుడు ఔను అంటే పెదాలను తనలాగా కత్తిరిస్తుందట.. ‘కాదు’ అంటే చంపేస్తుంది. ఔనన్నా.. కాదన్నా ఆమె చంపడం గ్యారెంటీ అని తెలిపారు.
1979లో కొన్ని నెలలు జపాన్ లో ఈ మాయలేడి సంచరించి అరాచకాలు చేసింది. ఓ చిన్నారిని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ కు గురై చనిపోయింది. పోస్టుమార్టంలో ఈమె పెదాలు చెవుల వరకు కోసి ఉండడం చూసి షాకయ్యారు. చనిపోయింది ఆ మాయలేడి అని వైద్యులు, పోలీసులు భావించారు. అయితే పోలీసులే ఇలా చనిపోయిన మహిళలనే హంతకురాలుగా చూపించారని.. ఆధారాలు బయటపెట్టలేదనే అనుమానాలున్నాయి. ఆ తర్వాత దక్షిణ కొరియాలోనూ ఇలాంటి హత్యలే జరగడం గమనార్హం. సో ఇప్పటికీ ఈ మిస్టరీ జపాన్, కొరియాల్లో వీడలేదు. ‘కుచిసాకే ఒన్నా’ అనే హత్యకు గురైన సమురాయ్ భార్య ఆత్మ చేసిందనే వారు లేకపోలేదు. దీనిపై ఎన్నో సినిమాలు హాలీవుడ్ లో కూడా వచ్చాయి.