Begin typing your search above and press return to search.

ఓజోన్‌ గ్యాస్ ‌తో కరోనాకి చెక్ పెట్టవచ్చట !

By:  Tupaki Desk   |   27 Aug 2020 5:15 AM GMT
ఓజోన్‌ గ్యాస్ ‌తో కరోనాకి చెక్ పెట్టవచ్చట !
X
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నా కూడా ఇది తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాను అరికట్టే సరైన వ్యాక్సిన్ వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం చాలా దేశాల శాస్త్రజ్ఞులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో జపాన్‌ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఓజోన్ వాయువు కూడా కరోనాకు చెక్ పెట్టగలదని గుర్తించారు. ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకులు ఓ చాంబర్‌ లో ఓజోన్ వాయువును ఉత్పత్తి చేసే యంత్రాన్ని అమర్చారు. అందులోనే కరోనా శాంపిల్‌ ను కూడా ఉంచారు. ఆ తరువాత.. చాంబర్ ‌లోని యంత్రం ద్వారా తక్కువ మోతాదు లో ఓజోన్ విడుదలయ్యేలా చేశారు. ఇలా పది గంటల గడిచాక చాంబర్‌లోని కరోనా శాంపిల్‌ను పరీక్షించగా.. వైరస్‌ల సంఖ్య 90 శాతం మేర తగ్గిపోయినట్టు వారు గుర్తించారు. అయితే ఇటువంటి విధానాన్ని ఆస్పత్రుల్లో పాటించవచ్చని, పేషెంట్లకు ఎటువంటి అపాయం ఉండదని కూడా వారు చెబుతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న వాతావరణం లో ఈ విధానం మరింత సమర్థవంతంగా కరోనాను అరి కడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్ వాయువు 0.05 నుంచి 0.1 పీపీఎం, మానవులకు హానిచేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని గుర్తించినట్టు తెలిపారు. ఓజోన్, ఒక రకమైన ఆక్సిజన్ అణువు. ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుంది. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కల ఓజోన్‌ వాయువు కరోనా వైరస్‌ కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పని చేస్తుంది. అయితే ఈ అధిక సాంధ్రత మానవులకు విషపూరితమైనది అని గతంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. అయితే , తాజా అధ్యయనం మాత్రం మనుషులకు ఏమాత్రం అపాయం కలగకుండానే ఓజోన్ అస్త్రాన్ని కరోనాపై ప్రయోగించవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.