Begin typing your search above and press return to search.
చంద్రుడి మీద జపాన్ భారీ ప్రాజెక్టు.. వివరాలు ఇవే
By: Tupaki Desk | 6 Oct 2020 7:50 AM GMTఇప్పటి సంగతి ఎలా ఉన్నా.. భవిష్యత్తులో మనిషికి చందమామ కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టనున్నారని చెప్పక తప్పదు. చంద్రుడిపై నీరు ఉందా? లేదా? అన్న విషయంపై సుదీర్ఘ పరిశోధనలు జరగ్గా.. ఆ విషయాన్ని తన తొలి అడుగులో భారత్ తేల్చేయటం తెలిసిందే. చంద్రయాన్ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో మంచు రూపంలో నీరు ఉందన్న విషయాన్ని గుర్తించారు.
అప్పటి నుంచి చందమామపై ఉన్న అంచనాలు మారటమే కాదు.. కొత్త ప్రాజెక్టులు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టుకు కసరత్తు చేస్తోంది బుల్లిదేశమైన జపాన్. నాసాతో కలిసి ముంచును ఇంధనంగా మార్చేందుకు వీలుగా జపాన్ కు చెందిన స్పేస్ ఏజెన్సీ జాక్సా నిర్ణయం తీసుకుంది.
చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఒక ఇంధన కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్నది జపాన్ ఆలోచన. చంద్రుడిపై అన్వేషణ కోసం భూమి నుంచి ఇంధనాన్ని తీసుకెళుతున్నారు. దీంతో.. అంతరిక్ష యాత్ర ఖర్చు భారీగా పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు చంద్రుడి మీద ఒక ఇంధన కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్నది జపాన్ ఆలోచన.
ఇందులో భాగంగా 2035 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువ వద్ద ముంచుతో ఉన్న నీటిని ఉపయోగించి ఇంధనాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. మంచులోని ఆక్సిజన్.. హైడ్రోజన వాయువుల్ని సోలార్ సెల్ ను ఉపయోగించి వేరు చేసి.. వాటిని మళ్లీ కలపటం ద్వారా ఇంధనాన్ని తయారు చేయాలని జపాన్ భావిస్తోంది. అదే నిజమైతే.. చంద్రుడి కక్షలో ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుడిపైకి వ్యోమగాముల ప్రయాణానికి అయ్యే ఇంధనం ఈ కర్మాగారం తయారుచేస్తుంది. దీంతో.. భారీ ఖర్చుకు తెర పడటమే కాదు.. చంద్రుడిపై మరింత ఫోకస్ పెట్టేందుకు వీలుంటుంది.