Begin typing your search above and press return to search.
అమరావతి విషయంలో జపానోడిది ఫిట్టింగా..?
By: Tupaki Desk | 22 July 2015 6:22 AM GMTఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో జపాన్ కీలక పాత్ర పోషించటానికి ముందుకు రావటం తెలిసిందే. అక్కడెక్కడో ఉన్న జపాన్.. ఇక్కడెక్కడో ఉన్న ఆంధ్రాలో.. అందునా కొత్తగా కట్టే రాజధాని అమరావతిలో కీలక పాత్ర పోషించటానికి అంత ఉత్సాహం చూపించటానికి కారణం ఏమిటి? దీన్లో మతలబు ఏంటి? జపానోడి ఆలోచన ఏమిటన్న దానిపై ఇప్పటివరకూ ఉన్న సందేహాల్ని పక్కన పెడుతూ.. తనకేం కావాలన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు.
ఏపీ రాజధానిలో కీలకభూమిక పోషించటానికి జపాన్ రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో మొదటిది.. రాజధాని నిర్మాణంలో అవసరమైన వస్తువుల్లో 65 శాతం తమ వద్దే కొనుగోలు చేయాలని.. మిగిలిన 35 శాతం ఎక్కడైనా కొనవచ్చని చెప్పింది. ఒకవేళ మీకీ ప్రతిపాదన నచ్చక పోతే.. ప్లాన్ టూ అంటూ మరో ఆలోచన చెప్పింది.
ఏపీ రాజధాని కోసం జపాన్ ఇచ్చే ఆర్థిక సాయానికి నాలుగు లేదా ఐదు శాతం వడ్డీ ఇవ్వాలని పేర్కొంది. దీనిపై తర్జన భర్జనలు పడిన ఏపీ సర్కారు.. చివరకు జపాన్ చేసిన మొదటి ప్రతిపాదనకు సై అంది. మరి.. మొదటి ప్రతిపాదన ఏపీకి గుదిబండగా మారుతుందా?అన్నది ఒక ప్రశ్న.
ఇంతకాలం ఏపీ రాజధాని గురించి జపాన్.. సింగపూర్ లు ఎందుకంత ఆసక్తిని ప్రదర్శించాయన్న దాని విషయానికి వస్తే.. ఏపీలో ఉన్న అద్భుత వ్యాపార అవకాశాలే. ఏపీ రాజధాని కోసం ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం రూ.3లక్షల కోట్లు అవసరమవుతాయన్న లెక్క కట్టిన విషయం తెలిసిందే. జపానోడి రూల్ ప్రకారం.. ఇందులో వస్తువుల వరకే చూసుకుంటే.. తక్కువలో తక్కువ రూ.2లక్షల కోట్ల వరకు అయినా(భవిష్యత్తులో పెరిగి అంచనాల్ని పరిగణలోకి తీసుకుంటే) వస్తుసామాగ్రిని సరఫరా చేయాల్సి వస్తుంది. చూస్తూ.. చూస్తూ ఇంత భారీ మార్కెట్ ను ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు.
జపాన్ వస్తే సామాగ్రితో పోలిస్తే.. చైనా నుంచి చౌకగా వచ్చే వీలుంది. అయితే.. చైనాలో నాణ్యతకు సంబంధించి సందేహాలు ఉండటం తెలిసిందే. అదే.. జపాన్ వస్తు సామాగ్రికి అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు వరకు జపాన్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే విషయంలో పెద్దగా విమర్శలు ఎదురు కాకపోవచ్చు. నాణ్యతలో వంకట పెట్టలేని విధంగా ఉండే వీలున్నందున.. మొదటి ప్రతిపాదనకు పెద్దగా విమర్శలు ఎదురుకాకపోవచ్చు.
కాకపోతే.. సమస్య వచ్చేది ఎక్కడంటే.. ఖర్చు విషయంలో. మామూలుగా అయ్యే ఖర్చు కంటే.. జపాన్ వస్తువులు ఖరీదైనవిగా ఉండటంతో ప్రాజెక్టు మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. మరోవైపు.. విలువైన విదేశీ మారక ద్రవ్యం తరలి వెళ్లే వీలుంది. వీటన్నింటికి తోడు మోడీ పిలుపునిచ్చన మేకిన్ ఇండియాకు భిన్నమైన ప్రతిపాదనగా చెప్పొచ్చు. చేతిలో డబ్బుల్లేనప్పుడు.. కోరికలు చాలానే ఉండి.. తీర్చుకోవాలంటే.. ఎవరితో ఒకరితో జత కట్టాల్సిందే. వారు చెప్పే రూల్స్ ను పాటించాల్సి ఉంటుందన్నది మరచిపోకూడదు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరెన్ని వెలుగు చూస్తాయో..?