Begin typing your search above and press return to search.

ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రౌడీషీటర్.. పోలీస్ కమిషర్ క్లారిటీ

By:  Tupaki Desk   |   3 Jan 2021 10:18 AM IST
ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రౌడీషీటర్.. పోలీస్ కమిషర్ క్లారిటీ
X
జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్టుపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కుట్ర పూరితంగా జంగాను అరెస్టు చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేయటంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని.. ఒక ఫిర్యాదు దారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే అరెస్టు చేయటం జరిగినట్లుగా స్పష్టం చేస్తున్నారు.

బెదిరించటం.. తన మాట వినని వారిపై దాడి చేయటం.. కిడ్నాప్ లు చేయటం లాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటంతోనే అతనిపై కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసింది భూకబ్జాలకు పాల్పడే వ్యక్తిని.. తన మాట వినని వారిపై తన అనుచరులతో దాడులు చేసి కిడ్నాప్ లకు పాల్పడే వ్యక్తిని. తాను టార్గెట్ చేసిన వారిని భయబ్రాంతులకు గురి చేయటాన్ని వృత్తిగా ఎంచుకున్న ఒక రౌడీ షీటర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా స్పష్టం చేశారు.

జంగా లాంటి నేత పలు కేసుల్లో నిందితుడని.. అతనిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుకు పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాంటి నేర చరిత ఉన్న నాయకుడిపై కాంగ్రెస్ నేతలు వకల్తా పుచ్చుకోవటం సరికాదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజల హక్కులకు.. వారిఆస్తులకు నష్టం చేకూరే ఎవరైనా సరే.. వారిపై తక్షణ చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.