Begin typing your search above and press return to search.

మ‌రీ.. ఇంత సినిమాటిక్ డైలాగులు సూట్ కావు ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   28 Jan 2019 8:15 AM GMT
మ‌రీ.. ఇంత సినిమాటిక్ డైలాగులు సూట్ కావు ప‌వ‌న్‌
X
ఎట‌కారం.. కాసింత అతిశ‌యోక్తి క‌ల‌గ‌లిపి పంచ్ డైలాగుల‌తో తెలుగు సినీ హీరోలు సినిమాల్లో చెల‌రేగిపోతుంటారు. రీల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేత‌ల నోటి నుంచి వ‌చ్చే కొన్ని డైలాగులు సినిమాటిక్ గా ఉంటాయి. అదే ప‌నిగా సినిమాల్లో న‌టించి.. న‌టించి.. వాస్త‌వ ప్ర‌పంచంలోనూ వాటిల్లో నుంచి బ‌య‌ట‌కు రాలేని త‌త్త్వం క‌నిపిస్తుంటుంది. అలాంటి కోవ‌కే చెందుతాయి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చే కొన్ని డైలాగులు.

కంటి చూపుతో కాల్చేస్తా.. లాంటి బ‌డాయి మాట‌లు సినిమాల్లో విన‌టానికిబాగుంటాయి కానీ రియ‌ల్ లైఫ్ కు అంత‌గా సెట్ కావు. ఎక్క‌డి దాకానో ఎందుకు.. ఆదివారం గుంటూరులో జ‌న‌సేన కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో త‌న అభిమానులు.. పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి ప‌వ‌న్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తిలో జ‌న‌సేన జెండా ఎగుర‌వేస్తామ‌ని ధీమాగా చెప్పారు.

ఇలాంటి వ్యాఖ్య‌లు క్యాడ‌ర్ ను.. నేత‌ల్ని ఉత్సాహ‌ప‌రిచేందుకు ఓకే కానీ.. ఇలాంటి డైలాగుల‌తో లాభం కంటే న‌స్ట‌మే ఎక్కువ‌. ఎందుకంటే.. ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ శ‌క్తి ఏమిట‌న్న‌ది ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక‌రిద్ద‌రు కూడా పేరున్న‌నేత‌లు లేని వేళ‌లో.. ఏకంగా అమ‌రావ‌తిలో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడిస్తాన‌న్న మాట‌లు అతిశ‌యోక్తిగా అనిపించ‌క మాన‌దు. సంస్థాగ‌తంగా పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ స‌ర్దుకున్న‌ది లేదు. బ‌ల‌మైన నేత‌లు అస్స‌లు లేరు. అలాంటి వేళ‌.. ఏపీ వ్యాప్తంగా తిరుగులేని మెజార్టీని సాధిస్తే త‌ప్పించి.. అమ‌రావ‌తిలో అధికారాన్ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

రీల్ లో విల‌న్ ముందు ఇర‌గ‌దీసే డైలాగుల వెనుక మాట‌ల ర‌చ‌యిత క‌స‌ర‌త్తు భారీగా ఉంటుంది. అక్క‌డ హీరో డైలాగు చెప్పిన త‌ర్వాత దానికి కౌంట‌ర్ గా చెప్పే మాట హీరోను మించేలా ఉండ‌దు. కానీ.. రియ‌ల్ లైఫ్ లో అలా ఉండ‌దు క‌దా? అలాంట‌ప్పుడు.. ప‌వ‌న్ లాంటోళ్లు ఇప్పుడు చెబుతున్న అమ‌రావ‌తిపై జ‌న‌సేన జెండా లాంటి వ్యాఖ్య‌ల్ని వీలైనంత వ‌ర‌కూ ఆచితూచి వాడితే బెట‌ర్. మూడు నెల‌ల త‌ర్వాత వ‌చ్చే ప‌లితానికి సూట్ అయ్యే మాట‌లు ప‌వ‌న్ నోటి నుంచి వ‌స్తే మంచిది. లేదంటే.. ఆయ‌న‌కు రానున్న రోజుల్లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురుకావ‌టం ఖాయం.