Begin typing your search above and press return to search.

బీజేపీతో జ‌న‌సేన క‌టీఫ్‌.. ఎంతో దూరం లేదా?

By:  Tupaki Desk   |   29 July 2021 10:34 AM GMT
బీజేపీతో జ‌న‌సేన క‌టీఫ్‌.. ఎంతో దూరం లేదా?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నిన్న టి శ‌త్రువు..నేడు మిత్రుడు కావొచ్చు..నేటి మిత్రుడు రేప‌టికి శ‌త్రువు కావొచ్చు. ఏరోజు కారోజు వేసుకునే పొలిటిక‌ల్ అంచనాలు.. పార్టీల‌కు ప్ర‌ధానంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఇవ‌న్నీ ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత బంధం పెట్టుకున్న బీజేపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ఇప్పుడు స‌ఖ్య‌త కుదర‌డం లేదు. జ‌న‌సేన‌పై బీజేపీ.. బీజేపీపై జ‌న‌సేన అసంతృప్తితోనే కాలం వెళ్ల‌దీస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ స‌ర్కారు సెంట్రిక్‌గా బీజేపీ దూకుడు రాజ‌కీయం చేస్తుంటే.. మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన మాత్రం.. అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. కొన్ని విష‌యాల్లో బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ముఖ్యమైన విష‌యాల్లో బీజేపీతో చేతులు క‌లిపేందుకు జ‌న‌సేనాని ముందుకు రావ‌డం లేద‌నేది కాషాయ ద‌ళం ప్ర‌ధానంగా చేస్తున్న విమ‌ర్శ‌. గ‌త కొన్నాళ్ళ కింద‌ట‌.. రాష్ట్రంలో హిందూదేవాల‌యాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు.. బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కూడా కొంత మేర‌కు గ‌ళం వినిపించింది. అయితే.. చ‌లో రామ‌తీర్థం యాత్ర‌కు మాత్రం దాడుగుమూత‌లాడింది.

అదేస‌మ‌యంలో బీజేపీ చేసిన ప్ర‌తి ప‌నికీ మేం రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హా రాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్ప‌ష్టం చేశారు. దీంతో.. అప్ప‌టి నుంచి బీజేపీ మానాన బీజేపీ కార్య‌క్ర మాలు చేసుకుంటూ.. పోతూ ఉంటే.. జ‌న‌సేన అవ‌కాశం ఉంటే.. క‌లుస్తోంది. లేక‌పోతే.. లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరి మ‌ధ్య పొత్తు ఉంటుందా.. ఊడుతుందా? అనే సందేహాలు కొన్నాళ్లుగా వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి.

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో కూడా ప‌వ‌న్ ముభావంగానే ప్ర‌చారం చేశార‌ని.. బీజేపీ నేత‌లు మ‌ధ‌న ప‌డుతున్నారు. పిల‌వ‌గా పిల‌వ‌గా.. ఏదో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయార‌ని.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఆయ‌న స‌రైన ఆదేశాలు కూడా ఇవ్వ‌లేద‌ని.. బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడిన విష‌యం... రుస‌రుస లాడిన విధానం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు టిప్పు సుల్తాన్, గోవధ వంటి అంశాలపై వైసీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, చెన్నకేశవరెడ్డిల‌తో బీజేపీ బ‌హిరంగ పోరుకు దిగుతున్న విష‌యం తెలిసిందే. ఛలో ప్రొద్దుటూరు పేరితో తాజాగా బీజేపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఈ క్ర‌మంలో బీజేపీ నేతల్ని అరెస్టులు చేసి కడపకు తరలించాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో సహజం గానే ఈ రెండు సున్నిత మైన అంశాలపై బీజేపీకి కౌంటర్ ఇవ్వలేక వైసీపీ సర్కార్ ఇబ్బందులు పడుతోం ది. అయితే.. ఈ క్ర‌మంలో ఈ రెండు అంశాల‌పై జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. క‌నీసం జనసేన ఈ రెండు అంశాల‌పై ప‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో మిత్రపక్షం జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ పోరు సాగిపోతోంది. అన్నింటికీ మించి జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ మైలైజ్ కూడా సాధించుకుంటోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

జగన్ సొంతగడ్డ రాయలసీమలో బీజేపీ దూకుడు కొనసాగుతున్నా జనసేన మాత్రం మౌనంగా ఉండిపో తుండటం, కీల‌క‌మైన అంశాలుగా బీజేపీ భావిస్తున్న గోవ‌ధ స‌హా టిప్పు సుల్తాన్ అంశాల‌పై మౌనంగా ఉండ‌డాన్ని బ‌ట్టి చూస్తే.. జన‌సేన ఇక ఎంతో కాలం బీజేపీతో సంబంధాలు కొన‌సాగించే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలావుంటే.. బీజేపీకి పెద్ద‌గా ఓటు బ్యాంకు లేక‌పోవ‌డం.. ఆ పార్టీ త‌మ‌పై ఆధార‌ప‌డ‌డం వంటివి కూడా జ‌న‌సేన సీరియ‌స్ గానే తీసుకుంటోంది. అదేస‌మ‌యంలో టీడీపీ మరోవైపు నుంచి ప‌వ‌న్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ క‌న్నా టీడీపీ అయితేనే బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో జ‌న‌సేన నేత‌లు ఉన్నార‌ని.. బీజేపీతో క‌టీఫ్ ఇక ఎంతో దూరంలో లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.