Begin typing your search above and press return to search.

ఉద్యమ రోజులు గుర్తు చేసుకోవాలంటున్న జనసేన

By:  Tupaki Desk   |   7 Oct 2019 10:18 AM GMT
ఉద్యమ రోజులు గుర్తు చేసుకోవాలంటున్న జనసేన
X
టీఎస్ ఆర్టీసీ లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గతంలో ఎన్నడూ చూడలేదు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు కూడా తమ పట్టు వీడట్లేదు. పండగ సమయంలో సమ్మె జరగడంతో ఊళ్లకు వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల బాధలు చూసిన తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులందరినీ తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అటు ఉద్యోగులు, ఇటు ప్రతిపక్షాలు కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి.

వీళ్ళకి ఇప్పుడు జనసేన పార్టీ కూడా తోడైంది. ఎవరైనా తమ డిమాండ్స్ నెరవేర్చుకోడానికి సమ్మె బాట పడితే వాళ్ళ బాధలు సానుకూల దృక్పథంతో చూడాలని పవన్ అన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారో గుర్తు చేసుకోవాలని, తెలంగాణ కోసం 17 రోజులు ఆర్టీసీ ఉద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఉద్యోగులు,ప్రభుత్వం ఇద్దరూ సహనంగా ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగుల పట్ల కెసిఆర్ సంయమనంతో వ్యవహరించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆలోచించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.