Begin typing your search above and press return to search.

మార్చి తరువాత మార్చనున్న జనసేన వ్యూహం...?

By:  Tupaki Desk   |   30 Nov 2022 8:00 PM IST
మార్చి తరువాత మార్చనున్న జనసేన వ్యూహం...?
X
జనసేన ఏపీలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అంతా అంగీకరిస్తున్న విషయం. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనసేన తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో సొంతంగా జనసేన పోటీ చేస్తే కనుక త్రిముఖ పోరు సాగి వైసీపీ మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే టీడీపీతో కలసి పోటీ చేస్తే మొత్తం రాజకీయ సినేరియో మారిపోవడం తధ్యమని కూడా చెబుతారు.

ఇదిలా ఉండగా జనసేన రాజకీయ విధానం ఎటు వైపు, ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు, ఎవరితో చేతులు కలుపుతారు అన్నది ఇపుడు సస్పెన్స్ గా ఉంది. ఈ మధ్యన విజయవాడలో చంద్రబాబుతో పవన్ భేటీని చూసిన వారు టీడీపీ సేన కలసి వస్తాయనుకున్నారు. తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లుగా పవన్ చెప్పిన నేపధ్యమూ ఆ దానికి ఊతమిచ్చింది.

అయితే ఆ తరువాత విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ సాగడంతో మొత్తం లెక్కలు తారు మారు అయ్యాయా అన్న డౌట్లూ వ్యక్తం అయ్యాయి. సోలోగా వస్తామని పవన్ ఈ రోజు దాకా ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో బీజేపీతో పొత్తు అన్న మాటను కూడా ఆయన వాడడంలేదు. మోడీతో భేటీని ఆ సమావేశం వివరాలను ఆయన ఎక్కడా వెల్లడించలేదు.

దాని మీద ఎవరి ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. పవన్ బీజేపీ పోటీకి దిగుతారని, ఏపీలో ముక్కోణపు పోరు తప్పదని అంటున్న వారూ ఉన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా జనసేన బరిలోకి దిగుతుంది అని అన్నవారూ ఉన్నారు. అయితే తాజాగా మంగళగిరిలోని పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లలోనూ వైసీపీని అధికారంలోకి రానీయమని మరోసారి నొక్కి చెప్పారు.

మీకు 175 సీట్లు ఎలా వస్తాయో చూస్తామని కూడా సవాల్ చేశారు. దాంతో అసలు పవన్ మనసులో ఏముంది అన్న చర్చ అయితే బయల్దేరింది. జనసేన పొత్తులతో కాకుండా విడిగా దిగితే కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఆ విషయం పవన్ కి కూడా తెలుసు. కానీ ఆయన తాను ఎవరితో పొత్తులతో కలసి వెళ్తాను అన్నది చెప్పకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఏపీలో బీజేపీతో జనసేన కలసి వెళ్తే ఎవరికీ లాభం లేదని కూడా ఆ పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీకి పెద్దగా బలం లేదని, దాంతో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని జనసేనన్లో చర్చ సాగుతోంది అంటున్నారు. అదే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు పొందవచ్చు అని అసెంబ్లీలో కూడా జనసేన జెండా రెపరెపలాడించవచ్చు అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. జనసేనలో డిప్యూటీ లీడర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ సహా కొందరు సీనియర్లు అయితే టీడీపీతో వెళ్తేనే బెటర్ అని సూచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో జనసేన తన ఉనికిని బలంగా చాటుకోవాలన్నా ఫ్యూచర్ పాలిటిక్స్ చేయాలన్నా కూడా టీడీపీతో వెళ్తేనే మంచిది అన్న సూచనలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే జనసేన ఆలోచనలు ఏంటి పొత్తుల వ్యూహాలు ఏమిటి అన్నవి కూడా మార్చి లో బయటపడతాయని అంటున్నారు. మార్చి తరువాత జనసేన అగ్రెస్సివ్ మోడ్ లో తన రాజకీయాన్ని ముందుకు సాగేలా చూస్తుందని అంటున్నారు. అది కచ్చితంగా వైసీపీకి యాంటీగా ఉంటుంది అని అంటున్నారు.

నిజానికి జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇమీడియట్ ఫలితాలు వస్తాయి. బీజేపీతో కలసి పోరాడాలంటే మరో రెండు ఎన్నికలు చూడాలి. అంతవరకూ వేచి చూసే ఓపిక ఆ పార్టీలో ఎంతమందికి ఉంది అన్నది కూడా చర్చగా ఉందని ప్రచారంలో ఉంది. అందుకే కీలకమైన డెసిషన్ మార్చిలోనే జనసేన వెలువరిస్తుంది అని అంటున్నరు. చూడాలి మరి పొత్తుల మీద జనసేన సస్పెన్స్ వీడితే ఏపీ రాజకీయాల కధ క్లైమాక్స్ కి చేరుకున్నట్లే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.