Begin typing your search above and press return to search.
కమలం కస్సుమంటోంది...మాట్లాడవేంటి సేనానీ...?
By: Tupaki Desk | 23 March 2023 4:24 PM GMTకమలం పార్టీకి కట్టలు తెంచుకున్న ఆగ్రహం వచ్చేసింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి మీద మంటెక్కిపోతోంది. పవన్ తమకు మిత్ర పక్షమా లేక ఏ పక్షం అన్నది వారికి అతి పెద్ద పజిల్ గా మారింది. దాంతో ఆ పజిల్ కి ఆన్సర్ కనుగొనే నేపధ్యంలోనే బీజేపీ సీనియర్ నేతల నోటి వెంట హాట్ హాట్ కామెంట్స్ వరసపెట్టి పవన్ మీద వచ్చి పడిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ మాత్రం సహకరించలేదని ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసిన సిట్టింగ్ పీవీఎన్ మాధవ్ ఒక్క లెక్కన బిగ్ సౌండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ణి మద్దతు ఇవ్వమని కోరినా ఏమీ రియాక్ట్ కాలేదని ఆయన చెప్పిన మాటలు కూడా నోట్ చేసుకోవాల్సినవే. అదే టైం లో వైసీపీని ఓడించండి అన్న పవన్ అదే నోటితో బీజేపీని గెలిపించండి అని ఎందుకు చెప్పలేదు అని లాజిక్ పాయింట్ తీసారు. అసలు జనసేన బీజేపీల మధ్య ఉన్నది ఏ బంధమో అర్ధం కావడం లేదు అనేశారు. కలసి జనాల వద్దకు వెళ్తేనే పొత్తు ఉంది అనుకుంటారని, కానీ అలాంటిది ఏదీ లేకుండా పోయిందని వాపోయారు.
ఇక ఇదే విషయం మీద బీజేపీ ఏపీ పెద్ద సోము వీర్రాజు కూడా మాట్లాడారు. ఆయన సైతం జనసేన తమకు సహకరించలేదనే అంటున్నారు. నిజానికి ఏ ఎన్నికల్లో జనసేన సహకరించిందని ఈ ఎన్నికనే బీజేపీ నేతలు పట్టుకుని కూర్చున్నారు అన్న చర్చ వస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం జనసేన క్యాడర్ దిగువ స్థాయిలో కలసి పనిచేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆనాడు బీజేపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి.
అపుడు కమలనాధులు కిక్కురుమనలేదు. ఇక ఈ మధ్యలో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు బద్వేల్, ఆత్మకూరులలో సైతం జనసేన సైడ్ అయిపోయింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల్లోనూ ఒకే ఒక్క మీటింగ్ కి పవన్ హాజరై మమ అనిపించారు. అంతకు మించి మిత్ర బంధం ఏముంది అన్నదే కదా చర్చ. అయినా సరే నాడు ఏమీ అనకుండా ఉన్న బీజేపీకి ఒక్కసారిగా ఇంత కోపం ఎందుకు వచ్చింది అన్నదే చర్చగా ఉంది.
దానికి కారణం ఏపీలో ఉన్న రెండు చట్టసభలలోనూ బీజేపీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ మంట అలా ఉంటే ఉత్తరాంధ్రాలో సిట్టింగ్ సీటు ఓడిపోవడం అది కూదా డిపాజిట్లు దారుణంగా గల్లంతు కావడంతో కమలం నేతలు కట్టలు తెంచుకున్న ఆవేశంతో జనసేన మీద కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇంత జరిగినా కమలం గుర్రు మీద ఉన్నా కూడా జనసేన నుంచి మాత్రం చిన్నపాటి రియాక్షన్ కూడా రావడంలేదు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ ఫుల్ సైలెంట్ గా ఉంది. కమలం పార్టీ నేతలు చేసిన ఆరోపణలు నిజమో కాదో చెప్పాల్సిన జనసేన నేతలు మరీ కాం గా ఉండడం మీద చర్చ సాగుతోంది. పవన్ని మద్దతు ఈయమని అడిగినా ఇవ్వలేదు అన్న బీజేపీ ఆరోపణ సీరియస్ గానే ఉంది. మరి నిజంగా అడిగితే ఇవ్వకపోవడం మీద ఏ ఏ కారణాలు ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత జనసేన మీద ఉంది కదా అంటున్నారు.
అయితే ఎటూ పొత్తుని తెంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే జాన్సేన ఉందని, అందుకే ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తోంది అని అంటున్నారు. ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారమే సాగుతోంది అని అంటున్నారు. తాము ఎటూ బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంటున్నామని, అవతల సైడ్ నుంచే వద్దు అనుకుంటే తమకు అదే అతి పెద్ద మేలు అన్నట్లుగా జనసేన నుంచి వినిపిస్తున్న మాట అని గుసగుసలు పోతున్నారు.
ఏది ఏమైనా ఏపీలో రెండు మిత్ర పక్షాల మధ్య బంధం అయితే అఫీషియల్ గా ఏనాడో ఎక్కడో కట్ అయిపోయిందని, ఇపుడు కొత్తగా ఏదో అనుకున్నంత మాత్రం అది నిలిచేది కాదని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా రాజకీయం బాగా నేర్చిన సేనాని మౌనంలో ఎన్నో అర్ధాలు ఉన్నాయని వాటినే బీజేపీ నేతలు వెతుక్కుంటే సరిపోతుంది అన్న వారూ ఉన్నారు..