Begin typing your search above and press return to search.

జనసేన స్కోర్ పెరుగుతోంది... ?

By:  Tupaki Desk   |   5 Nov 2021 1:30 PM GMT
జనసేన స్కోర్ పెరుగుతోంది... ?
X
మార్పు వస్తోంది. అది మెల్లగానే మొదలవుతోంది. ఈ విషయం చెప్పడానికి ఏ సర్వే అవసరం లేదు. రాజకీయ నాయకుల కదలికలు, అంతర్గత చర్చలలో హాట్ హాట్ టాపిక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తే చాలు. ఇప్పటిదాకా ఏపీలో జనసేన రేంజి ఏంటి అంటే ఓన్లీ వన్ ఎమ్మెల్యే అని అంతా అంటారు. అది నిజమే కావచ్చు. కానీ రెండున్నరేళ్ళు తిరిగేసరికి మాత్రం సీన్ మారుతోంది. ఏపీలో జనసేన చేప కింద నీరు మాదిరిగా బలపడుతోంది. ఏపీలో రెండు ప్రధాన పార్టీలలో ఉన్న బలహీనతలు, వారు చేసే తప్పులే ఇపుడు జనసేనకు అతి పెద్ద బలంగా మారబోతున్నయి. విశాఖ లాంటి చోట్ల జనసేన లోకి వరసబెట్టి వలసలు సాగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఈ మధ్య విశాఖ టూర్ చేసినపుడు ఆయన సమక్షంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సంకు వెంకటేశ్వర్లు చేరిపోయారు. ఆయనకంటూ బలముంది. కొంత పట్టుంది. దాంతో పవన్ కూడా కండువా కప్పి బాగా పనిచేసుకోమని చెప్పారు. ఇక ఇపుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట లాంటి చోట పసుపు పార్టీకి చెందిన పెద్ద నాయకుడు, పారిశ్రామిక వేత్త అప్పారావు జనసేనలో చేరారు. ఆయన్ని పార్టీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఇక్కడ గడచిన రెండు దశాబ్దాల్లో ఒక్కసారి తప్ప అన్ని సార్లూ టీడీపీయే గెలుస్తూ వస్తోంది. అలాంటి పట్టున చోట గట్టి టీడీపీ నేత జనసేనలోకి జంప్ అయ్యారు అంటే మెల్లగా రాజకీయ ప్రకంపనలు మొదలైట్లే.

ఇపుడు ఉత్తరాంధ్రాలో కూడా చాలా మంది నాయకులు జనసేనలో చేరడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. వారిలో అధికార వైసీపీ నుంచి కూడా ఉన్నారు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి వస్తేనే ఎవరైనా చేరేది. ఎవరినైనా తీసుకునేది. పవన్ మాత్రం ఫ్రెష్ గా ఉండేవారిని, కొత్త వారినే చేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు అంటున్నారు. అదే విధంగా ప్రధాన పార్టీలలో అవకాశం దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చినా కండువా కప్పుతున్నారు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇపుడు ఆ చేరికలే పెద్ద ఎత్తున సాగుతున్నాయని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలో చూసుకుంటే బలమైన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది జనసేన వైపుగా రావడానికి చూస్తున్నారు. తొలిదశలో దీని వల్ల టీడీపీకి కొంత దెబ్బ తగిలినా రాను రానూ అధికార పార్టీకి కూడా షాక్ ఇచ్చేలా జనసేనలో చేరికలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి పవన్ మార్క్ రాజకీయం మొదలైంది అని జనసైనికులు సంబరపడుతున్నారు. వారు ఒక్కటే మాట అంటున్నారు. 2019 కాదిది 2024. మా సత్తా ఏంటో చూపిస్తామని. సో ఏపీలో జనసేన బలపడుతోంది. అది కూడా చాలా వేగంగానే సాగుతోంది. ఏపీలో ఎవరూ ఊహించని అద్భుతమే జరగబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి.